Shocking: తమిళనాడు తంజావూర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక ప్రభుత్వ మహిళాకళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని ఆడశిశువుకు జన్మనిచ్చింది. పురిటినొప్పులు రావడంతో టాయిలెట్‌కి వెళ్లిన విద్యార్థిని బిడ్డను ప్రసవించింది. ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండేందుకు బిడ్డను చెత్తబుట్టలో పారేసింది. యూట్యూబ్‌లో చూస్తే బొడ్డు పేగుని కోసి పాపను చెత్తకుండిలో విసిరేసి క్లాస్ రూంకి తిరిగి వచ్చింది.
Read Also: Toll fee: దారుణం.. టోల్ ఫీజు ఎగొట్టడానికి సిబ్బందిని తొక్కించుకుంటూ వెళ్లిన బస్సు..
అయితే, క్లాస్ రూంకి వచ్చిన తర్వాత తీవ్రంగా రక్తస్రావం కావడంతో, దుస్తులకు రక్తపు మరకలు అంటాయి. ఇది గమనించిన సహచర విద్యార్థినులు కాలేజీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తర్వాత బిడ్డను చెత్తబుట్ట నుంచి బయటకు తీసి, తల్లిని బిడ్డని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. విద్యార్థిని డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లించారు.
బంధువుతో ప్రేమ వ్యవహారం కారణంగా 20 ఏళ్ల విద్యార్థిని గర్భం దాల్చినట్లు తెలిసింది. విద్యార్థిని తల్లి అనారోగ్యంతో ఉందని, ఆమె తండ్రి పని నిమిత్తం ఊరి దూరంగా ఉంటున్నాడని, అప్పుడప్పుడు మాత్రమే ఇంటికి వస్తుంటాడని, ఈ క్రమంలోనే విద్యార్థిని తన బంధువుతో ప్రేమలో పడినట్లు తెలిసింది. పోలీసులు విద్యార్థిని ప్రియుడిని సంప్రదించగా, ఆమె శారీరక సంబంధం ఉందని ఒప్పుకున్నాడు, తానే బిడ్డకు తండ్రి అని చెప్పాడు. అతను పని నిమిత్తం వేరే ప్రాంతంలో ఉన్నానని, రెండు రోజుల్లో వస్తానని చెప్పాడు. విద్యార్థిని తన ప్రియుడిపై ఫిర్యాదు చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో పోలీసులు కేసు పెట్టలేదు. త్వరలోనే రెండు కుటుంబాల నిర్ణయంతో మహిళా పోలీస్ స్టేషన్‌లోనే వివాహం జరగొచ్చని తెలుస్తోంది.