Singam Style Police: తమిళనాడులో సింగం సినిమాలో మాదిరిగా.. రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్‌ను పట్టుకునేందుకు ఓ ఎస్‌ఐ ప్రయత్నించారు. ఈ ఎపిసోడ్‌లో సదరు ఎస్‌ఐ చివరకు ఫెయిల్ అయ్యాడు. అయితే, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన మయిలై శివకుమార్ హత్య కేసులో అళగురాజా ప్రధాన నిందితుడు.. ఇప్పటికే అతడిపై పలు స్టేషన్‌లో చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ క్రమంలో సదరు రౌడీ షీటర్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. తాజాగా నిందితుడు తిరువళ్లూరు జిల్లాలో దాక్కున్నాడనే సమాచారంతో అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. ఇక, అతడు ఉన్న ప్రాంతానికి పోలీసులు వెళ్లారు.
ఇక, పోలీసుల రాకను పసిగట్టిన రౌడీ షీటర్ అళగురాజా, అతడి బ్యాచ్.. అక్కడి నుంచి పరార్ అయ్యారు. వీరంతా ఓ కారులో జంప్ అవుతుండగా.. వారిని జామ్ బజార్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆనంద కుమార్ వెంటాడారు. ఈ సందర్భంగా, వాళ్లు ప్రయాణిస్తున్న కారుపైకి ఎస్ఐ దూకారు. తిరువళ్లూరు-తిరుపతి హైవేపై సదరు ఎస్‌ఐ.. కారుకు డోర్‌కు వేలాడుతూ దాదాపు ఒక కిలోమీటర్ కి పైగా వెళ్లారు. కారుతో పాటు ఎస్‌ఐని అళగురాజా ఈడ్చుకెళ్లిన.. తర్వాత కారు లోపల ఉన్న నిందితులు ఎస్‌ఐ ఆనంద్ కుమార్ ను తోసివేయడంతో ఆయన రోడ్డుపై పడిపోయారు.
కాగా, ఎస్‌ఐ ఆనంద కుమార్.. హెల్మెట్ పెట్టుకోవడంతో పెను ప్రమాదం నుంచి బయట పడ్డాడు. రన్నింగ్ కారు నుంచి ఎస్‌ఐ కింద పడిపోవడంతో గాయపడ్డారు. దీంతో అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోసారి రౌడీ షీటర్ అళగురాజా.. పోలీసుల నుంచి తప్పించుకు పోయాడు.
திருவள்ளுர் அடுத்த திருப்பாச்சூர் பகுதியில் சென்னை ஸ்பெஷல் டீம் போலீசார் முக்கிய வழக்கு ஒன்றில் தொடர்புடைய குற்றவாளியை சினிமாவில் வரும்சண்டைக் காட்சிகளையும் மிஞ்சும் அளவிற்கு துரத்தி சென்றபோது கீழே விழும் காட்சி#Tiruvallur #Chanakyaa pic.twitter.com/x3m4Q7ceJp
— சாணக்யா (@ChanakyaaTv) June 26, 2025
