Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

  • తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..
  • టైరు పేలి అదుపుతప్పిన కారు..
  • నలుగురు విద్యార్థులు మృతి
Up Road Accident

Up Road Accident

Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదురాంతగం సమీపంలో ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పుదుచ్చేరి టూర్ ముగించుకుని చెన్నైకి తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా వెనుక టైరు పేలడంతో వాహనం అదుపుతప్పినట్లు సమాచారం. దీంతో కారు పలుమార్లు పల్టీలు కొట్టినట్లు తెలుస్తోంది.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు విద్యార్థులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతున్నట్లు సమాచారం. ప్రమాద ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే వెనుక టైరు ఒక్కసారిగా పేలడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు కూడా సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.