Vijay TVK: “బాక్సాఫీస్ వద్దే కాదు.. బ్యాలెట్ బాక్సుల వద్ద కూడా అతనే ‘తుపాకీ’! విజయ్ సీఎం అవుతాడా?
- తమిళ రాజకీయ చరిత్రలో మరో నూతన అధ్యాయం
- ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న టీవీకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay TVK: దేశ రాజకీయ చరిత్రలోనే సరికొత్త చరిత్ర మొదలైంది. ఒకప్పుడు ఎన్టీఆర్, ఎంజీర్ నెలకొల్పిన రికార్డ్‌ను ఎన్నో ఏళ్ల తర్వాత మరొకరు సృష్టించడంతో యావత్ దేశం మొత్తం తమిళనాడు వైపు ఆశ్చర్యంతో, ఆనందంతో చూస్తుంది. ప్రస్తుతం తమిళ రాజకీయ చరిత్రలో మరో నూతన అధ్యాయం మొదలైంది. వెండితెరపై ‘దళపతి’గా కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న జోసెఫ్ విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తన సత్తా చాటుతున్నారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తన తొలి ఎన్నికల్లోనే కనీవినీ ఎరుగని రీతిలో దూసుకుపోతోంది.
సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు అందిన ట్రెండ్స్ ప్రకారం.. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే ఏకంగా 109 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 2024 ఫిబ్రవరిలో పార్టీని ప్రకటించి, ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే 234 స్థానాల్లో పోటీ చేసిన విజయ్.. అరంగేట్రంలోనే ఈ స్థాయి ఫలితాలు సాధించడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ద్రవిడ దిగ్గజ పార్టీలకు ప్రత్యామ్నాయంగా విజయ్ తనను తాను మలుచుకున్నారు. అవినీతి నిర్మూలన, నాణ్యమైన విద్య, మహిళా సాధికారతే లక్ష్యంగా ఆయన ఎన్నికల ప్రచారం సాగింది. ముఖ్యంగా యువతను, విద్యార్థులను ఆకట్టుకోవడంలో విజయ్ విజయవంతమయ్యారు. “పిల్లలు తమ తల్లిదండ్రుల ఓటును ప్రభావితం చేయాలి” అంటూ ఆయన చేసిన పిలుపు క్షేత్రస్థాయిలో బాగా పనిచేసినట్లు కనిపిస్తోంది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
మహిళలు, నిరుద్యోగులే టార్గెట్‌గా వరాల జల్లు
విజయ్ మేనిఫెస్టోలోని అంశాలు ఓటర్లను విపరీతంగా ఆకర్షించాయి. మహిళల కోసం నెలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.1,000 నుంచి రూ.2,500కి పెంచుతామని, ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల కోసం 12వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు చదువుకునేందుకు ఎటువంటి గ్యారెంటీ లేకుండా రూ.25 లక్షల వరకు విద్యా రుణం అందిస్తామని ప్రకటించారు. నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ఆర్థిక సాయంతో పాటు, కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకునే యువతకు ఎలాంటి గ్యారెంటీ లేని రుణాలను మేనిఫెస్టోలో చేర్చారు.
విజయ్‌కి సీఎం పీఠం దక్కుతుందా?
ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం విజయ్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన పూర్తి మెజారిటీ వస్తుందా? లేదా కింగ్ మేకర్‌గా నిలుస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, యువ ఓటర్లలో విజయ్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. దశాబ్దాలుగా సాగుతున్న వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడుతూ, ఏఐ (AI) ఆధారిత భవిష్యత్ తమిళనాడును నిర్మిస్తానన్న ఆయన నినాదం ఫలించినట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఈ ట్రెండ్స్ తుది ఫలితాలుగా మారితే.. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఒక బలమైన శక్తిగా స్థిరపడటం ఖాయంగా కనిపిస్తుంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!