CM Vijay: సీఎం విజయ్‌కి షాక్ ఇచ్చిన మిత్రపక్షాలు.. ‘రెండు ఆకుల’ రాజకీయంలో దళపతి వెనకడుగు!
- మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గిన టీవీకే
- తిరుగుబాటు ఏఐఏడీఎంకే నేతలకు నో క్యాబినెట్ బర్త్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్‌కు చెందిన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి మద్దతు ఇస్తున్న తిరుగుబాటు ఏఐఏడీఎంకే (AIADMK) ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించబోమని విజయ్ తన మిత్రపక్షాలకు స్పష్టం చేశారు. కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షాలైన విదుతలై చిరుతైగళ్ కచ్చి (VCK), వామపక్షాల (లెఫ్ట్ పార్టీలు) నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో విజయ్ ఈ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.
వీసీకే చీఫ్ హెచ్చరిక
టీవీకే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్న తిరుగుబాటు ఏఐఏడీఎంకే శాసనసభ్యులకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందంటూ గత కొన్ని రోజులుగా ఊహాగానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో టీవీకేకు మిత్రపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవడంతో టీవీకే ఈ అధికారిక వివరణ ఇచ్చింది. తిరుగుబాటుదారులైన ఏఐఏడీఎంకే సభ్యులకు మంత్రి పదవులు ఇవ్వనున్నరాని వస్తున్న వార్తలపై వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ తీవ్రంగా స్పందించారు. ఒకవేళ టీవీకే గనుక తిరుగుబాటు వర్గానికి క్యాబినెట్ పదవులు ఇస్తే, తాము కూటమికి ఇస్తున్న మద్దతును పునరాలోచించుకోవాల్సి వస్తుందని ఆయన బహిరంగంగానే హెచ్చరించారు. “ఈ విషయాన్ని నేను కొన్ని రోజుల క్రితమే స్పష్టం చేశాను. అయితే ప్రస్తుతానికి అటువంటి చర్య ఏదీ ఆలోచనలో లేదని టీవీకే నాయకత్వం నుంచి మాకు స్పష్టమైన హామీ లభించింది. తిరుగుబాటు ఏఐఏడీఎంకే వర్గానికి క్యాబినెట్ పదవులు ఇచ్చే ప్రసక్తే లేదని టీవీకే మాకు తెలియజేసింది” అని తిరుమావళవన్ పేర్కొన్నారు.
Also Read
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
- DILRMP 3.0: ఇకపై మీ భూమికి కూడా 'ఆధార్' లాంటి నెంబర్.. కేంద్రం సరికొత్త పథకం ప్రారంభం.!
- Sabita Indra Reddy: చీర లాగారు.. కింద పడేసి తొక్కారు.. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాం..
మరోవైపు తిరుగుబాటు ఏఐఏడీఎంకే శాసనసభ్యులతో ఎలాంటి అధికారిక అధికార భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నా తమకు అభ్యంతరమేనని సీపీఐ(ఎం) కూడా స్పష్టం చేసింది. వీసీకే బాటలోనే వామపక్షాలు కూడా గట్టి పట్టుబట్టడంతో విజయ్ సర్కార్ తిరుగుబాటు వర్గాన్ని పక్కన పెట్టక తప్పలేదని సమాచారం. ఈ రాజకీయ పరిణామాల మధ్య టీవీకే ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున ఇవాళ ఉదయం మీడియాకు కీలక వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి విజయ్ త్వరలోనే తన మంత్రివర్గ విస్తరణను ప్రకటిస్తారని, మిత్రపక్షాలతో అధికారాన్ని పంచుకోవడానికి తమ పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తమిళనాడులో సామాజిక న్యాయం కోసం నిలబడిన పార్టీలకు, ముఖ్యంగా తమకు అండగా నిలిచిన కాంగ్రెస్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని సీఎం విజయ్ బలంగా ఆకాంక్షిస్తున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా క్యాబినెట్లో చేరాలని విజయ్ పట్టుబడుతున్నట్లు ఆదవ్ తెలిపారు.
కాంగ్రెస్, వీసీకేలకు ఆహ్వానం
ప్రభుత్వానికి కేవలం బయటి నుంచే మద్దతు ఇవ్వాలన్న వామపక్ష పార్టీల సిద్ధాంతపరమైన నిర్ణయాన్ని టీవీకే గౌరవిస్తుందని.. అయితే వీసీకే (VCK), ఐయూఎంఎల్ (IUML) పార్టీలను మాత్రం మంత్రివర్గంలోకి రావాల్సిందిగా అధికారికంగా ఆహ్వానించామని ఆదవ్ అర్జున పేర్కొన్నారు. “టీవీకే అధికార భాగస్వామ్యానికి రెడీగా ఉంది. 1967 తర్వాత తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కూటమి ప్రభుత్వం ఇలా అధికారాన్ని పంచుకోవడం ఇదే తొలిసారి కాబోతోంది” అని ఆదావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ స్వరూపంపై తీవ్రమైన చర్చలు, సస్పెన్స్ నడుస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవైపు మిత్రపక్షాల డిమాండ్లను సమతుల్యం చేసుకుంటూనే, మరోవైపు తిరుగుబాటు ఏఐఏడీఎంకే శాసనసభ్యులను అధికారిక పదవులకు దూరంగా ఉంచడంలో సీఎం విజయ్ ప్రస్తుతానికి విజయం సాధించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!