CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay Simplicity: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే దళపతి విజయ్ తన సింప్లిసిటీతో అందరినీ ఆశ్చర్యపరిచారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార వేడుకలో విజయ్ చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వేదికపై ఉంటే.. ఆయన కోసం పదుల సంఖ్యలో సిబ్బంది పని చేస్తుంటారు. కానీ తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించి తనలోని ‘సింప్లిసిటీ’ని చాటుకున్నారు.
అసలేం జరిగిందంటే..
ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత, గవర్నర్ అర్లేకర్‌తో కలిసి గ్రూప్ ఫొటో దిగాలని నిర్ణయించారు. అయితే ఆ సమయంలో ఫోటోకు అడ్డంగా వేదికపై కొన్ని టేబుల్స్ ఉన్నాయి. సిబ్బంది వచ్చి ఆ టేబుల్స్‌ను పక్కకు తీస్తుండగా, అది చూసిన విజయ్ ఏమాత్రం సంకోచించకుండా స్వయంగా రంగంలోకి దిగారు. సిబ్బందితో పాటు టేబుల్ పట్టుకుని సుమారు పది అడుగుల దూరం వరకు మోసుకెళ్లి పక్కన పెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా సామాన్యుడిలా సిబ్బందికి సహాయం చేయడం చూసి స్టేడియంలో ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. “అధికార ఆర్భాటం లేని ముఖ్యమంత్రి”, “సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్” అంటూ నెటిజన్లు విజయ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దళపతి రాజకీయ ప్రస్థానం అంతా ఇలానే సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read
- IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
టేబుల్ మోసిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. అధికార గర్వం ఏ మాత్రం ప్రదర్శించని సీఎం విజయ్.. తన పదవి కాలం మొత్తం కూడా ఇలాగే ఉంటే ఆయనకు రాజకీయాల్లో తిరుగు ఉండదని ఆయన అభిమానులతో పాటు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. #CMVijay pic.twitter.com/HHT6xyauLZ
— cinemapremikudu (@ganesh310720) May 10, 2026
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!