Site icon NTV Telugu

కాన్వాయ్ ఆపి అంబులెన్స్ కి దారి..శభాష్ సీఎం

మానవత్వాన్ని చాటుకున్నారు తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్. తన కాన్వాయ్‌ను ఆపి మరీ అంబులెన్స్‌కు దారిచ్చారు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్‌పై ప్రశంసలజల్లు కురుస్తోంది. చెన్నైలో తన కాన్వాయ్‌ వెళ్తుండగా అంబులెన్స్‌ సైరన్ వినిపించింది. దీంతో వెంటనే తన కాన్వాయ్ ఆపేసి అంబులెన్స్ వెళ్ళిపోనిచ్చారు. ఈవిధంగా స్టాలిన్ తన గొప్పతనాన్ని చాటుకున్నారు. చెన్నైలో నేటి నుంచి విద్యా సంస్థలు పున: ప్రారంభమయ్యాయి. ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కు బ‌డులు తెరిచారు. ఇవాళ ఉద‌యం సీఎం స్టాలిన్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన స్టాలిన్‌ విద్యార్ధులకు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

కోయంబ‌త్తూరు – వెల‌చెరి రూట్లో సీఎం కాన్వాయ్ వెళ్తోంది. అదే స‌మ‌యంలో.. వెనుక నుంచి ఓ అంబులెన్స్ వేగంగా దూసుకువచ్చింది. ఇది గమనించిన ముఖ్యమంత్రి స్టాలిన్ అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించారు. సీఎం వేగంగా వెళ్తున్న ఆ అంబులెన్స్ కోసం దారివ్వాలని ఆదేశించారు.

ముఖ్యమంత్రి వాహ‌న‌శ్రేణి దారిని ఇచ్చింది. ఎడ‌మ వైపు కాన్వాయ్‌ను ఆపి.. అంబులెన్స్‌కు మార్గాన్ని క‌ల్పించారు. మార్గమ‌ధ్యంలో కాన్వాయ్‌ను నిలిపివేసి.. అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం స్టాలిన్‌పై తమిళ జనం ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు అధికార దర్పాన్ని సాధ్యమయినంత మేర తగ్గించాలని ఇటీవల ప్టాలిన్ అధికారులకు సూచించారు.

Exit mobile version