Tamil Nadu Cabinet approves ordinance to ban online gambling in state: ఆన్‌లైన్ గేమింగ్ పిల్లలు, యువతపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాలు ఆన్‌లైన్ గేమింగ్ నిషేధించాలని భావిస్తున్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రం ఆన్‌లైన్ గేమింగ్ ను నిషేధిస్తూ.. రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆర్ధినెన్స్ కు ఆమోదం తెలిపింది. తమిళనాడు గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత రాష్ట్రంలో ఆర్డినెన్స్ అమలులోకి రానుంది.
ఆన్‌లైన్ రమ్మీ, పోకర్ వంటి ఆన్‌లైన్ జూదం వంటి వాటిపై రాష్ట్రప్రభుత్వ నిషేధాన్ని మద్రాస్ హైకోర్టు కోట్టేసిన తీర్పును సవాల్ చేస్తూ.. తమిళనాడు ప్రభుత్వం దాకలు చేసిన పిటిషన్ పై సెప్టెంబర్ 10న సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇది జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్ లను నిషేధిస్తూ ఆర్డినెస్స్ తీసుకురాబోతోంది.
Read Also: Taniya Bhatia: లండన్ హోటల్‌లో చేదు అనుభవం.. రూమ్‌లోకి దూరి..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఈ ఆన్‌లైన్ గేమింగ్ లను నిషేధించాలని కోరుతున్నాయి. అయితే కేరళ, తమిళనాడు, కర్ణాటక హైకోర్టులు ఆన్‌లైన్ స్కిల్ గేమింగ్‌ను నిషేధం రాజ్యాంగ విరుద్ధమని వీటి నిషేధించే చట్టాలను కొట్టేశాయి. ఆన్‌లైన్ రమ్మీ, పేకాట వంటి ఆటలను నిషేధిస్తూ.. తమిళనాడు గేమింగ్ అండ్ పోలీస్ చట్టం 2021ని తీసుకువచ్చింది. అయితే దీన్ని మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. దీనిపై తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంను ఆశ్రయించింది.
ఆన్‌లైన్ గేమింగ్ వలన యువకులు, ఇతరులు పెద్ద ఎత్తున తమ సంపాదనను కోల్పోతున్నారని తమిళనాడు ప్రభుత్వం కోర్టులో వాదించింది. అనేక ఆర్థిక, సామాజిక నష్టాలకు ఈ ఆన్‌లైన్ గేమింగ్ లు కారణం అవుతున్నాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రమ్మీ అనేది నైపుణ్యంతో కూడిన గేమ్ అయినప్పటికీ.. ఇది తరువాత వ్యసనంగా జూదంగా మారుతుందని పేర్కొంది.
