తమిళ నటుడు అభినయ్ (44) కన్నుమూశారు. సుదీర్ఘ కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న అభినయ్.. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ‘తుళ్లువాదో ఇల్లమై’ సినిమాలోని పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే చాలా కాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స కోసం సాయం కోరగా సహనటులు ధనుష్, హాస్యనటుడు కేపీవై బాలా సాయం చేశారు.
ఇక ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్ రచనలో.. తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంలో వచ్చిన ‘‘తుళ్లువాదో ఇల్లమై’’ అనే తొలి సినిమాతో అభినయ్ వెలుగులోకి వచ్చాడు. ఆరుగురు హైస్కూల్ విద్యార్థుల చుట్టూ తిరిగే ఈ చిత్రంలో అభినయ్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా అప్పట్లో కాసుల వర్షం కూడా కురిపించింది.
ఇది కూడా చదవండి: US: అమెరికాలో విషాదం.. ఏపీ విద్యార్థిని అనుమానాస్పద మృతి!
2014 వరకు అభినయ్ తమిళం, మలయాళంలో అనేక చిత్రాల్లో నటించాడు. అనంతరం ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా పని చేశాడు. ఈ ఏడాది అభిషేక్ లెస్లీ దర్శకత్వంలో తమిళ చిత్రం ‘గేమ్ ఆఫ్ లోన్స్’తో మళ్లీ తెరపైకి వచ్చాడు. ప్రచారంలో భాగంగా అక్టోబర్‌లో మీడియా ముందుకు కూడా వచ్చాడు. ఇంతలోనే మృత్యువు వెంటాడింది. ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని కోడంబార్కంలోని ఆయన నివాసంలో ఉంచినట్లు సినీ వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: Bihar Elections: రేపే మలి విడత పోలింగ్.. బూత్‌లకు చేరుకుంటున్న సిబ్బంది
