Site icon NTV Telugu

Lalu Prasad Yadav: భారత్‌కు లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. కూతురు ఎమోషనల్ ట్వీట్

Lalu Prasad Yadav

Lalu Prasad Yadav

Lalu Prasad Yadav: కిడ్నీ మార్పిడి చేయించుకున్న బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శనివారం ఇంటికి చేరుకోనున్నారు. లాలూ ప్రసాద్‌కు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రి ఇండియాకు వస్తున్నప్పుడు ఆయన ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రోహిణి ట్విట్టర్‌లో వెల్లడించింది. నాన్నపై మీ ప్రేమకు హద్దులు లేవని తెలుసు. మా నాన్న ఇండియా వచ్చిన తర్వాత ఎవరైనా కలవాలనుకుంటే మాస్క్ ధరించి ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలని కోరింది. మరో ట్వీట్‌లో ఎవరినైనా కలవాలన్నా అందరూ మాస్క్ ధరించాల్సిందేనని వైద్యులు చెప్పారని, తండ్రని ఎవరినైనా కలిసినప్పుడు మాస్క్ కూడా ధరించాలని తెలిపింది. ఈ మేరకు వైద్యులు సలహా ఇచ్చారని కూతురు రోహిణి ట్వీట్ చేశారు. తన తండ్రి ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఆమె తెలియజేశారు.

గతేడాది డిసెంబర్ 5న సింగపూర్ వైద్యులు లాలూకి కిడ్నీ మార్పిడిని విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండు కిడ్నీల పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో మరో మార్గం లేక కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. రోహిణి ఆచార్యకు తన తండ్రిపై ఉన్న ప్రేమను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కొనియాడారు. ఆడపిల్లలందరూ రోహిణిలా ఉండాలి. నువ్వంటే గర్వంగా ఉంది. భవిష్యత్ తరాలకు మీరే ఆదర్శం’’ అని గిరిరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.

Exit mobile version