Site icon NTV Telugu

Swiggy: స్విగ్గీ బంప‌ర్ ఆఫ‌ర్.. ఇకపై హైద‌రాబాదీల‌కు కూడా పాకెట్‌హీరో ఆఫర్!

Swiggy

Swiggy

ప్రముఖ డెలివరి యాప్ స్విగ్గీ హైదరాబాదీ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్‌ వంటి న‌గ‌రాల్లోనే ఉన్న పాకెట్ హీరో ప్లాన్‌ను ఇప్పుడు హైదరాబాదీలకు కూడా తెచ్చేందుకు నిర్ణయించింది. ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లు ఫ్రీ డెలివరి పొందడమే కాదు నిర్ధిష్ట రెస్టారెంట్స్ నుంచి ఫుడ్ ఆర్డర్లపై 60 శాతం వ‌ర‌కూ డిస్కౌంట్ ల‌భిస్తుంది. మిడిల్ క్లాస్, స్టూడెంట్స్ బడ్జెట్ ఫ్రెడ్లీగా దష్ట్యా స్విగ్గీ ఈ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఆధునిక జీవితంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అంత‌ర్భాగ‌మైంది.

Also Read: UK: పీరియడ్స్ నొప్పి.. భరించలేక గర్భనిరోధక మాత్రలు.. 16 ఏళ్ల బాలిక బ్రెయిన్ డెడ్

ఒక్క క్లిక్‌తో మనకు నచ్చిన రెస్టారెంట్ నుంచి నోరురుంచే ఫుడ్ నిమిషాల్లో ఇంటికి వస్తుంది. అయితే ప‌రిమిత బ‌డ్జెట్ ఉన్న మిడిల్ క్లాస్ వ‌ర్గాల‌కు మాత్రం ఇంట్లోనే రెస్టారెంట్ రుచులు ఆస్వాదించ‌డం ఇప్పటికీ లగ్జరీగానే మిగిలింది. ఆర్థిక స్థోమత కారణంగా డెలివరి యాప్ ఫీజులు, రెస్టారెంట్ చార్జీల వల్ల ఫుడ్ డెలివరి చేసుకునేందుకు జంకుతున్నారు. అలాంటి వారి కోసం స్విగ్గీ పాకెట్‌హీరో అనే ఫీచ‌ర్‌తో ముందుకొచ్చింది. ఈ ప్లాన్‌లో ద్వారా కస్టమర్లు ఫ్రీ డెలివ‌రీతో పాటు నిర్ధిష్ట రెస్టారెంట్స్ నుంచి ఫుడ్ అర్డర్లపై 60 శాతం వ‌ర‌కూ డిస్కౌంట్ పొందవచ్చు.

Also Read: KTR Tweet: కేటీఆర్ కామెంట్స్‌కు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కౌంటర్ అటాక్

పాకెట్ హీరో ప్లాన్ ద్వారా జేబుకు చిల్లు ప‌డ‌కుండా రుచిక‌ర‌ర‌మైన భోజ‌నాన్ని ఆస్వాదించాల‌నుకునేవారికి పాకెట్‌హీరో ఫీచర్ గేమ్ ఛేంజ‌ర్ కానుంది. ఇప్పటి వరకు స్విగ్గీ ఈ ఫీచర్‌‌ను ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, జైపూర్‌, ల‌క్నో, చండీఘ‌ఢ్ వంటి న‌గ‌రాల్లోనే తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ ప్లాన్‌ను త్వరలోనే హైదరాబాద్‌తో పాటు బెంగ‌ళూర్‌, ముంబై, పుణే, చెన్నై, కోల్‌క‌తా వంటి న‌గ‌రాల‌కూ కూడా స్విగ్గీ విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

Exit mobile version