Site icon NTV Telugu

Swiggy and DineOut : డైనింగ్‌ అవుట్‌ఫాంలోకి స్విగ్గీ..

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గి టైమ్స్ ఇంటర్నెట్-బ్యాక్డ్ డైనింగ్ అవుట్ ప్లాట్‌ఫారమ్ డైనౌట్‌ను దాదాపు 200 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని విశ్వసనీయ వర్గాలు సోమవారం ఇక్కడ తెలిపాయి. డైనౌట్‌ ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ క్రెడ్‌తో కూడా చర్చలు జరుపుతోంది, అయితే స్విగ్గీ స్పష్టంగా రేసును గెలుచుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే స్విగ్గీ-డైనౌట్‌ ప్రతినిధులు చర్చలు ఇప్పుడు 200 మిలియన్‌ డాలర్ల పరిధిలో (Dineout యొక్క ప్రస్తుత విలువ ప్రకారం) కొనుగోలు కోసం చివరి దశలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. స్విగ్గీ సమీప ప్రత్యర్థి జొమాటో ఇప్పటికే డైనింగ్ అవుట్ బిజినెస్‌లో అడుగుపెట్టింది. టైమ్స్ ఇంటర్నెట్ 2014లో డైనింగ్ అవుట్ ప్లాట్‌ఫారంను రూ. 60 కోట్లకు కొనుగోలు చేసింది. మహమ్మారి గత రెండు సంవత్సరాలుగా దేశంలోని డైనింగ్ అవుట్ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది దీంతో డైనౌట్‌ వ్యాపారం కూడా ప్రభావితమైంది.

నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) ప్రకారం, ఎఫ్‌వై21లో, భారతీయ ఆహార సేవల పరిశ్రమ తీవ్రంగా కుదించబడి 25 శాతానికి పైగా ఆహార వ్యాపార నిర్వాహకులు శాశ్వతంగా మూసివేయబడటానికి దారితీసింది. దీని ఫలితంగా దాదాపు 24 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.”ఎఫ్‌వై21లో, భారతదేశంలో ఆహార సేవల పరిశ్రమ 53 శాతం క్షీణించింది మరియు ఎఫ్‌వై2020లో రూ. 4,23,624 కోట్లతో పోలిస్తే రూ. 2,00,762 కోట్లుగా అంచనా వేయబడింది” అని ఎన్‌ఆర్‌ఏఐ ప్రెసిడెంట్ కబీర్ సూరి తెలిపారు.

Exit mobile version