Swiggy Delivered 3.5 Lakh Biryanis On New Year’s Eve: ప్రపంచం మొత్తం 2023 నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది. ఇదిలా ఉంటే ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఏకంగా డిసెంబర్ 31 శనివారం రోజు 3.5 లక్షల బిర్యానీలను డెలివరీ చేసింది. రాత్రి 10.25 గంటల వరకు దేశవ్యాప్తంగా 61,000 పిజ్జాలను పంపిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే అన్ని రకాల బిర్యానీల్లో హైదరాబాద్ బిర్యానీనే టాప్ లో నిలిచింది. మరోసారి హైదరాబాద్ బిర్యానీకి తిరుగు లేదని నిరూపించుకుంది. ట్విట్టర్ నిర్వహించిన పోల్ ప్రకారం హైదరాబాద్ బిర్యానీకి 75.4 శాతం ఆర్డర్లు వచ్చాయని.. లక్నో బిర్యానీకి 14.2 శాతం, కోల్‌కతా బిర్యానీకి 10.4 శాతం ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది. 3.5 లక్షల ఆర్డర్లతో బిర్యానీ అగ్రస్థానంలో ఉందని తెలిపింది.
Read Also: China Covid: చైనాలో కరోనా విలయ తాండవం.. రోజుకి 9 వేల మరణాలు
స్విగ్గీ శనివారం రాత్రి 7.20 గంటల వరకు 1.65 లక్షల బిర్యానీ ఆర్డర్లను డెలివరీ చేసింది. హైదరాబాద్ లో బిర్యానీకి ఫేమస్ అయిన బావార్చి రెస్టారెంట్ 2021 కొత్త సంవత్సరంలో నిమిషానికి 2 బిర్యానీలను డెలివరీ చేసింది. దీనికి అనుగుణంగా డిసెంబర్ 31,2021 నాటికి డిమాండ్ కు తగినట్లు 15 టన్నుల రుచికరమైన వంటకాలను సిద్ధం చేసింది. డోమినోస్ ఇండియా 61,287 పిజ్జాలను డెలివరీ చేసింది. శనివారం రాత్రి 7 గంటల వరకు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో 1.76 లక్షల చిప్‌ల ప్యాకెట్లను ఆర్డర్ చేసినట్లు కూడా తెలిపింది.
కిరాణా డెలివరీ ప్లాట్‌ఫారమ్ అయిన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా 2,757 ప్యాకెట్ల డ్యూరెక్స్ కండోమ్‌లు డెలివరీ చేయబడ్డాయని పేర్కొంది. భారతదేశం అంతటా దాదాపుగా 12,344 మంది వ్యక్తుల కొత్త సంవత్సరం సందర్భంగా రాత్రి 9.18 గంటల వరకు కిచిడిని ఆర్డర్ చేసినట్లు తెలిపింది.
