Madhyapradesh: ద్వారకా పీఠాధిపతి శంకారాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి ఇకలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swami Swaroopanand Saraswati passes away: ద్వారకా పీఠాధిపతి, ప్రముఖ హిందువుల మతగురువు, జగద్గురు శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి కన్నుమూశారు. ఆయన ఈ రోజు మధ్యాహ్నం మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్‌లో ఉన్న శ్రీధామ్ జ్యోతేశ్వర్ ఆశ్రమంలో ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు శివైక్యం చెందారు. స్వరూపానంద వయసు ప్రస్తుతం 99 సంవత్సరాలు కాగా.. స్వామి స్వరూపానంద సరస్వతి దేశంలోని అత్యున్నత ఆధ్యాత్మిక పీఠాధిపతిగా ఉన్నారు. ఆయన గుజరాత్‌లోని ద్వారకా శారదా పీఠానికి, బద్రీనాథ్‌లోని జ్యోతిమఠాలకు శంకరాచార్యులుగా ఉన్నారు. ఇటీవలే హరియాలీ తీజ్ రోజున స్వామీజీ 99వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.
1300 సంవత్సరాల క్రితం ఆది శంకరాచార్యుల వారు ఏర్పాటుచేసిన నాలుగు శక్తి పీఠాల్లో ద్వారకా, జ్యోతిర్మఠ్ శక్తి పీఠాలకు స్వామి స్వరూపానంద అధిపతిగా కొనసాగుతున్నారు. స్వామి స్వరూపానంద మధ్యప్రదేశ్ లోని సియోనీ జిల్లా దిఘోరీ గ్రామంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వేదవేదాంగాలను అభ్యసించి దేశంలో ప్రముఖ పీఠాధిపతిగా ఎదిగారు. స్వరూపానంద స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారు. స్వరూపానంద సరస్వతి హిందువులలో గొప్ప మత నాయకుడిగా పరిగణించబడ్డారు. చివరి క్షణంలో శంకరాచార్య అనుచరులు, శిష్యులు ఆయన దగ్గరే ఉన్నారు. ఆయన మరణవార్త తెలియగానే.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆశ్రమానికి చేరుకోవడం ప్రారంభించారు.
Also Read
- CM Vijay: "1967 నాటి తప్పు పునరావృతం కావొద్దు".. ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ..
- US Trade: చైనా ‘టారిఫ్ మోసం’ బయటపెట్టిన అమెరికా.. భారత్ పేరు ఎందుకు వచ్చింది?
- Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
- India Independence: భారత్‌కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
Mani Sharma: కృష్ణంరాజు మరణం మరువకముందే మణిశర్మ ఇంట మరో విషాదం
ద్వారకాపీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ దుఃఖ సమయంలో ఆయన అనుచరులకు ప్రధాని తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజావార్తలు
-
Realme P4s Lite: రియల్మీ P4s లైట్.. 7000mAh బ్యాటరీతో చౌకైన ఫోన్.. ఫీచర్లు అదిరిపోయేలా!
-
Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
-
India – Pakistan: మొదట భారత్ తరఫున ఆడి.. ఆ తర్వాత పాకిస్థాన్ తరఫున ఆడిన క్రికెటర్లు వీరే..!
-
Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
-
CM Vijay: “1967 నాటి తప్పు పునరావృతం కావొద్దు”.. ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ..
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!