Site icon NTV Telugu

Madhyapradesh: ద్వారకా పీఠాధిపతి శంకారాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి ఇకలేరు..

Swami Swaroopananda Saraswati

Swami Swaroopananda Saraswati

Swami Swaroopanand Saraswati passes away: ద్వారకా పీఠాధిపతి, ప్రముఖ హిందువుల మతగురువు, జగద్గురు శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి కన్నుమూశారు. ఆయన ఈ రోజు మధ్యాహ్నం మధ్యప్రదేశ్‌లోని నర్సింగపూర్‌లో ఉన్న శ్రీధామ్ జ్యోతేశ్వర్ ఆశ్రమంలో ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు శివైక్యం చెందారు. స్వరూపానంద వయసు ప్రస్తుతం 99 సంవత్సరాలు కాగా.. స్వామి స్వరూపానంద సరస్వతి దేశంలోని అత్యున్నత ఆధ్యాత్మిక పీఠాధిపతిగా ఉన్నారు. ఆయ‌న‌ గుజరాత్‌లోని ద్వారకా శారదా పీఠానికి, బద్రీనాథ్‌లోని జ్యోతిమఠాల‌కు శంకరాచార్యులుగా ఉన్నారు. ఇటీవలే హరియాలీ తీజ్‌ రోజున స్వామీజీ 99వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.

1300 సంవత్సరాల క్రితం ఆది శంకరాచార్యుల వారు ఏర్పాటుచేసిన నాలుగు శక్తి పీఠాల్లో ద్వారకా, జ్యోతిర్మఠ్ శక్తి పీఠాలకు స్వామి స్వరూపానంద అధిపతిగా కొనసాగుతున్నారు. స్వామి స్వరూపానంద మధ్యప్రదేశ్ లోని సియోనీ జిల్లా దిఘోరీ గ్రామంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వేదవేదాంగాలను అభ్యసించి దేశంలో ప్రముఖ పీఠాధిపతిగా ఎదిగారు. స్వరూపానంద స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ఎంతో కృషి చేశారు. స్వరూపానంద సరస్వతి హిందువులలో గొప్ప మత నాయకుడిగా పరిగణించబడ్డారు. చివరి క్షణంలో శంకరాచార్య అనుచరులు, శిష్యులు ఆయన దగ్గరే ఉన్నారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త తెలియగానే.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆశ్రమానికి చేరుకోవడం ప్రారంభించారు.

Mani Sharma: కృష్ణంరాజు మరణం మరువకముందే మణిశర్మ ఇంట మరో విషాదం

ద్వారకాపీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ దుఃఖ సమయంలో ఆయన అనుచరులకు ప్రధాని తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Exit mobile version