రూ. 820 కోట్ల విలువైన యూకో బ్యాంక్ IMPS లావాదేవీల అనుమానాస్పద ట్రాన్స్ క్షన్స్ సంబంధించిన కేసులో సీబీఐ రాజస్థాన్, మహారాష్ట్రలోని ఏడు నగరాల్లోని 67 ప్రాంతాల్లో భారీ సోదాలు నిర్వహిస్తోంది. గతేడాది నవంబర్ 10-13 మధ్య ఏడు ప్రైవేట్ బ్యాంకులకు చెందిన 14,600 ఖాతాల నుంచి IMPS అంతర్గత లావాదేవీల ద్వారా 41,000 యూకో బ్యాంక్ ఖాతాల్లోకి తప్పుగా పోస్ట్ చేయబడ్డాయని యూకో బ్యాంక్ ఫిర్యాదు చేసింది.
Read Also: HanuMan OTT: హనుమాన్ ఓటీటీ ఎంట్రీ కోసం వెయిట్ చేసే వారికి బాడ్ న్యూస్?
దీనిపై సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) నవంబర్ 21న కేసు నమోదు చేసింది. రూ. 820 కోట్లు యూకో బ్యాంక్ ఖాతాల్లోకి ఇతర బ్యాంకుల ఖాతాల నుంచి డెబిట్ చేయకుండానే జమచేయబడ్డాయి. అనేక మంది ఖాతాదారులు ఈ పరిస్థితిని ఉపయోగించుకుని వివిధ మార్గాల ద్వారా నిధులను విత్‌డ్రా చేసుకోవడం ద్వారా తప్పుడు లాభాలు పొందారని సీబీఐ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 2023లో కోల్‌కతా, మంగళూర్‌లోని యూకో బ్యాంక్ అధికారుల 13 ప్రదేశాల్లో సోదాలు జరిగాయి. ఈ దాడుల్లో యూకోబ్యాంక్,ర ఐడీఎఫ్‌సీకి సంబంధించి దాదాపు 130 నేరారోపణ పత్రాలు, 40 మొబైల్ ఫోన్‌లు, రెండు హార్డ్ డిస్క్‌లు, ఇంటర్నెట్ డాంగిల్ సహా 43 డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ తెలిపింది. 30 మంది అనుమానితులను ప్రశ్నిస్తోంది.