Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandhi Reel Row: గుజరాత్‌లోని సూరత్‌లో సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన రీల్ పోస్ట్ చేసిన కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మహాత్మా గాంధీ చిత్రంతో ఉన్న రూ.500 కరెన్సీ నోటును అభ్యంతరకర రీతిలో చూపిస్తూ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన మహిళను 47 ఏళ్ల సిమ్రాన్ పటేల్‌గా గుర్తించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ ఫాలోవర్లు
సిమ్రాన్ పటేల్ సూరత్‌లోని అదాజన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఆమె క్రమం తప్పకుండా షార్ట్ వీడియోలు, రీల్స్ పోస్ట్ చేస్తుంటారని వెల్లడించారు. పోలీసుల ప్రకారం.. అక్టోబర్ 1న మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఆమె ఈ వీడియోను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి ఉండటంతో, దానికి ముందు రోజు ఈ రీల్ పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
పోలీసులే షేర్ చేసిన ‘బిఫోర్-ఆఫ్టర్’ వీడియో
సిమ్రాన్ పటేల్ అరెస్ట్ విషయాన్ని సూరత్ పోలీసులు తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో మొదట సిమ్రాన్ పటేల్ రూ.500 నోటును చేతిలో పట్టుకున్న దృశ్యాలు కనిపిస్తాయి. అనంతరం ఆమె చేతులకు బేడీలు ఉన్న దృశ్యాలను పోలీసులు చూపించారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వీడియోను పోస్ట్ చేసినందుకు ఆమె క్షమాపణలు చెబుతున్న దృశ్యాలు కూడా పోలీసుల వీడియోలో ఉన్నాయి.
మహాత్మా గాంధీ చిత్రంతో ఉన్న కరెన్సీ నోటును అభ్యంతరకరంగా చూపిస్తూ సిమ్రాన్ పటేల్ రీల్ రూపొందించారని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త ధర్మేశ్ గామి సూరత్ క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎలక్ట్రానిక్ రూపంలో అశ్లీల లేదా అభ్యంతరకరమైన సమాచారాన్ని ప్రచురించడం, ప్రసారం చేయడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన నేపథ్యంలో సూరత్ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. సమాజంలో విభేదాలు, అశాంతి లేదా సామాజిక విద్వేషాలకు దారితీసే అవకాశం ఉన్న అభ్యంతరకరమైన కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని ప్రజలను కోరారు. పోలీసుల వివరాల ప్రకారం.. సిమ్రాన్ పటేల్ వివాహం అనంతరం సుమారు 17 ఏళ్ల క్రితం సూరత్‌లో స్థిరపడ్డారు. ఆమె 12వ తరగతి వరకు చదువుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్న కంటెంట్ క్రియేటర్లు ఏదైనా వీడియో లేదా రీల్ పోస్ట్ చేసే ముందు దాని ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి చర్చకు తెచ్చింది.
સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ અને લાઇક્સ મેળવવાની લાલચમાં કાયદાનું ઉલ્લંઘન ભારે પડી શકે છે… https://t.co/iWR69Pgps9
— Surat City Police (@CP_SuratCity) October 4, 2026
తాజావార్తలు
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!