Same Gender Marriage: స్వలింగ వివాహాలలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలని కోరుతూ వచ్చిన పిటిషన్లను ఈ రోజు సుప్రీంకోర్టు విచారించనుంది. ఇలాంటి వివాహాలను కేంద్ర వ్యతిరేకించి తర్వాతి రోజే ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారించనుంది. ఇప్పటికే దీనిపై కేంద్రం తన స్పష్టమైన వాదనని తెలియజేసింది. చట్టపరమైన అనుమతిని పార్లమెంట్ కు వదిలేయాలని, ఇది కోర్టుల పరిధిలోని అంశం కాదని వెల్లడించింది. ఇది కుటుంబ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని తెలిపింది. హిందూ, ముస్లిం వివాహాల్లో, వివాహం అంటే కేవలం పురుషుడు మరియు స్త్రీల మధ్య జరిగేదిగా కేంద్ర పేర్కొంది.
Read Also: Rishi Sunak: రిషి సునాక్ పై పార్లమెంటరీ విచారణ.. కారణం ఇదే..
స్వలింగ వివాహాలు అనేవి కేవలం పట్టణాల్లోని ఉన్నత వర్గాల అభిప్రాయం అని, ఇది విస్తృత ప్రజలు అభిప్రాయం కాదని పేర్కొంది. గ్రామీణ, పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని ప్రజలు అభిప్రాయాలు, మతాలు, విశ్వాసాలను పరిగణలోకి తీసుకుని ఈ అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. ఓ అంశానికి చట్టబద్ధత కల్పించడం ప్రజాప్రతినిధులతో కూడిన పార్లమెంట్ విధిగా తెలిపింది. ఇలాంటి చర్యలు ప్రజలు ప్రయోజనాలకు భంగం కలిగిస్తాయని పేర్కొంది. ఈ విషయంతో కోర్టు జోక్యం తగదని సుతిమెత్తగా చెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌కె కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పిఎస్ నరసింహలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్వలింగ వివాహాల చట్టబద్ధత కేసును విచారించనుంది.