NTV Telugu Site icon

Supreme Court: స్వలింగ వివాహాల చట్టబద్ధతపై తీర్పు రిజర్వ్.. విచారణ పూర్తి చేసిన సుప్రీం..

Supreme Court

Supreme Court

Supreme Court: సుప్రీంకోర్టులో ప్రతిష్టాత్మకంగా భావించి విచారణ చేసిన స్వలింగ వివాహాల చట్టబద్ధత పిటిషన్లపై విచారణ పూర్తయింది. ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ పూర్తి చేసింది. తీర్పును రిజర్వ్ చేసింది. దాదాపుగా 10 రోజలు పాటు సుదీర్ఘంగా దీనిపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్కే కౌల్,జస్టిస్ ఎస్ ఆర్ భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడా ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వ ‘స్వలింగ వివాహాల’ చట్టబద్ధతకు వ్యతిరేకంగా తన వాదనల్ని వినిపించింది.

Read Also: Vijayashanti : 6 నెలల్లో కేసీఆర్‌ని గద్దె దింపాలి.. బీజేపీ ప్రభుత్వం రావాలి

ఈ సమస్య కేవలం పట్టణాల్లోని ఉన్నత శ్రేణికి సంబంధించిన కొంతమంది వ్యక్తులకు మాత్రమే పరిమితమని, ఇది సమాజంపై లోతైన ప్రభావాన్ని చూపిస్తుందని, ఈ అంశాన్ని పార్లమెంట్ కే వదిలేయాలని కేంద్రం తన వాదనల్ని వినిపించింది. దీనిపై అన్ని స్థాయిల్లో అన్ని వర్గాల్లో చర్చ జరగాలని తెలిపింది. దీనిపై బుధవారం కూడా కేంద్రం తన వాదనల్ని వినిపించింది. స్వలింగ వివాహాలపై ఎటువంటి ప్రకటన చేసిన ఆది సరైన చర్య కాదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే దీనిపై అభిప్రాయాలను తెలియజేయాలని రాష్ట్రాలను కోరినట్లు సుప్రీంకు కేంద్రం తెలిపింది. అస్సాం, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించాయని, మరికొన్ని రాష్ట్రాలు మరింత సమయం కోరాయిన వెల్లడించింది కేంద్రం.

పిటిషన్ల తరుపున అభిషేక్ మను సింఘ్వీ, రాజు రామచంద్రన్, కేవీ విశ్వనాథన్, ఆనంద్ గ్రోవర్, సౌరభ్ కర్పాల్ తన వాదనల్ని వినిపించారు. స్వలింగ వివాహాల చట్టబద్ధతపై మార్చి నెలలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేసింది. ఈ కేసుల ఫర్టిలిటీ అంశానికి సంబంధించింది కావడంతో రాజ్యాంగ హక్కులు, ప్రత్యేక వివాహ చట్టాలు, ప్రత్యేక శాసనాలతో ముడిపడి ఉండటంతో రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేస్తున్నట్లు తెలిపింది. సుదీర్ఘమైన వాదనల్ని విన్న సుప్రీం బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది.

Show comments