Site icon NTV Telugu

Udhayanidhi Stalin: ‘‘సనాతన ధర్మం’’పై వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టులో ఉదయనిధికి ఉపశమనం..

Udhayanidhi Stalin

Udhayanidhi Stalin

Udhayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన ‘‘సనాతన’’ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ఉదయనిధికి సుప్రీంకోర్టు ఉపశమనం కలిగించింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన మూడు రిట్ పిటిషన్లను స్వీకరించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్‌ని ఎలా కొనసాగించవచ్చని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న బి వరలేలతో కూడా ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిటిషన్లను కొట్టివేయడంతో పాటు చట్ట ప్రకారం ప్రత్యామ్నాయ పరిష్కారాలను కోరుకునే స్వేచ్ఛను పిటిషనర్లకు కల్పించింది.

Read Also: Racharikam: వరుణ్ సందేశ్ నెగెటివ్ పాత్రలో రాచరికం.. జనవరి 31న రిలీజ్

2023 సెప్టెంబర్‌లో చెన్నైలో జరిగిన ఒక సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘సనాతన ధర్మం’’ సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని, మలేరియా, డెంగ్యూలాగా దానిని నిర్మూలించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. డీఎంకే తీరును ప్రశ్నించాయి. ఈ వ్యాఖ్యలు లోక్‌సభ ఎన్నికల ముందు ప్రచార అస్త్రంగా మారింది.

Exit mobile version