Supreme Court: ఉరిశిక్షకు బదులుగా ఇంజెక్షన్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- ఉరిశిక్ష విధానాన్ని మార్చాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.
- ఉరికి బదులుగా లెథల్ ఇంజెక్షన్ తదితర పద్ధతులు తీసుకురావాలని పిటిషన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఉరిశిక్ష విధానాన్ని తొలగించి, (లెథల్ ఇంజెక్షన్) ప్రాణాంతక ఇంజెక్షన్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. అయితే, ఉరిశిక్ష అమలు చేసే ప్రస్తుతం విధానంపై సమగ్ర సమీక్ష జరిపేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అడ్డంకి లేదని కోర్టు స్పష్టం చేసింది.
మరణ శిక్ష అమలులో ఉరి ద్వారా వచ్చే అనవసరమైన బాధను తొలగిస్తూ, దోషిగా తేలిన ఖైదీ గౌరవాన్ని కాపాడే ప్రత్యామ్నాయ పద్ధతి ఏదైనా ఉందా అనే అంశాన్ని నిపుణుల కమిటీ ద్వారా కేంద్ర పరిశీలించవచ్చని ధర్మాసనం పేర్కొంది. సీనియర్ న్యాయవాది రిషి మల్హోత్రా ఈ పిటిషన్‌ను 2017లో దాఖలు చేశారు. మరణశిక్ష అమలు కోసం ఉరిని చట్టం నుంచి తొలగించి, తక్కువ బాధ కలిగించే పద్ధతుల్ని ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. లెథల్ ఇంజెక్షన్, కరెంట్ షాక్, గ్యాస్ చాంబర్ వంటి విధానాలను ప్రత్యామ్నాయాలుగా పిటిషన్లో ప్రస్తావించారు. మరణశిక్ష పడిన ఖైదీకి ఉరి లేదా లెథన్ ఇంజెక్షన్ వంటి విధానాల్లో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఇవ్వాలని మల్హోత్రా వాదించారు.
Also Read
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
- Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
2023 మార్చిలో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధానం సముచితమైందా.? తక్కువ బాధ కలిగించేదా అనే అంశాన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అంశంపై కేంద్రం నుంచి సమాచారం కోరింది. అయితే, శిక్ష విధించే విధానాల్లో ఏదో ఒక నిర్దిష్ట పద్ధతిని అమలు చేయాలని పార్లమెంట్‌ను ఆదేశించి అధికారొం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2018లో కేంద్రం ఉరిశిక్ష విధానాన్ని సమర్థించింది. లెథల్ ఇంజెక్షన్, కాల్చడం వంటి ఇతర పద్ధతులు ఉరి కన్నా తక్కువ బాధకరమైనవని నిరూపించే తగిన ఆధారాలు లేవని పేర్కొంది. ఉరి విధానం వేగవంతమైనదని, సరళమైనదని కేంద్రం అప్పట్లో అఫిడవిట్లో తెలిపింది.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!