NTV Telugu Site icon

Supreme Court: జడ్జిలపై ఎంక్వైరీ చేయడం దారుణం.. లోక్‌పాల్‌కు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

Supreme Court

Supreme Court

Supreme Court: హైకోర్టు న్యాయమూర్తులను విచారించే అధికారం తమకు ఉందంటూ లోక్‌పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఆ ఉత్తర్వులు ఆందోళనకరంగా ఉందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, లోక్‌పాల్ రిజిస్ట్రార్‌లకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు సిట్టింగ్ అదనపు జడ్జిపై దాఖలైన రెండు ఫిర్యాదులను లోక్‌పాల్ దర్యాప్తు చేస్తుంది. లోకాయుక్త చట్టం 2013 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను విచారించే అధికారం తమకు ఉందంటూ జనవరి 27వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని ఎంక్వైరీ చేపట్టి.. స్టే ఇచ్చింది. అలాగే, సదరు హైకోర్టు న్యాయమూర్తి పేరును బయటకు వెల్లడించొద్దని ఫిర్యాదుదారుడికి ఆదేశాలు ఇచ్చింది.

Read Also: Delhi CM Rekha Gupta: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం..

అయితే, లోక్‌పాల్ ఈ అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కన్నా మార్గదర్శకత్వం కోరింది. ఫిర్యాదులపై తదుపరి చర్యలను ఈ సందర్భంగా న్యాయస్థానం వాయిదా వేసింది. కాగా, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ద్వారా మేము చివరకు ఒక సమస్యను నిర్ణయించామని స్పష్టంగా తెలియజేస్తున్నాం.. పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన హైకోర్టు న్యాయమూర్తులు 2013 చట్టంలోని సెక్షన్ 14 పరిధిలోకి వస్తారా లేదా అనేది నిశ్చయంగా ఉందని లోక్‌పాల్ తెలిపింది.