Site icon NTV Telugu

Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court

Supreme Court

వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కీలక ప్రొవిజన్‌ను నిలిపివేస్తూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్‌ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని నిలిపివేసింది. కొన్ని విభాగాలకు కొంత రక్షణ అవసరం అని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, న్యాయమూర్తి ఎజి మసీహ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ఇది కూడా చదవండి: Puja Khedkar: కొత్త చిక్కుల్లో మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్

వక్ఫ్ సవరణ చట్టంపై సోమవారం సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. వక్ఫ్ చట్టం మొత్తాన్ని స్టే విధించడానికి న్యాయస్థానం నిరాకరించింది. కొన్ని నిబంధనలను నిలిపివేసింది. కొన్ని విభాగాలకు మాత్రం రక్షణ అవసరం అని పేర్కొంది. ఒక వ్యక్తి ఇస్లాం మతాన్ని ఆచరించే వ్యక్తిగా ఉండి వక్ఫ్‌ను సృష్టించడానికి ఐదు సంవత్సరాలు ఉండాలన్న వక్ఫ్ సవరణ చట్టం 2025లోని నిబంధనను తాజాగా నిలిపివేసింది. ఒక వ్యక్తి ఇస్లాం మతాన్ని ఆచరించేవాడో లేదో నిర్ణయించడానికి నియమాలు రూపొందించే వరకు ఈ నిబంధన నిలిపివేయబడుతుందని పేర్కొంది. అటువంటి నియమం/యంత్రాంగం లేకుండా ఈ నిబంధన ఏకపక్షంగా అధికారాన్ని వినియోగించుకోవడానికి దారితీస్తుందని బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం కోర్టు పేర్కొంది.

ఇది కూడా చదవండి: US: న్యూయార్క్ గవర్నర్ సంచలన ప్రకటన.. మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీకి మద్దతిస్తున్నట్లు వెల్లడి

వక్ఫ్ చట్టంలోని మరో నిబంధన ప్రకారం.. వక్ఫ్‌గా ప్రకటించబడిన ఆస్తి.. ప్రభుత్వ ఆస్తినా కాదా అని నిర్ణయించడానికి కలెక్టర్‌కు అధికారం కల్పించి.. ఉత్తర్వులు జారీ చేసే అధికారాన్ని కూడా నిలిపివేసింది. వ్యక్తిగత పౌరుల హక్కులను తీర్పు చెప్పడానికి కలెక్టర్‌కు అనుమతి లేదని.. ఇది అధికారాల విభజనను ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

Exit mobile version