ఫీజు విషయంలో ఐఐటీ సీటును కోల్పోయిన దళిత విద్యార్థికి సుప్రీంకోర్టు ఊరట లభించింది. 18 ఏళ్ల అతుల్ కుమార్ తన చివరి ప్రయత్నంలో ప్రతిష్టాత్మకమైన జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. ఐఐటీ ధన్‌బాద్‌లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో సీటు లభించింది. అయితే జూన్ 24వ తేదీ వరకు గడువులోగా రూ.17,500 ఫీజు చెల్లించలేకపోయాడు. దినసరి కూలీలైన అతడి తల్లిదండ్రులు గడువులోగా ఫీజు కట్టలేకపోయారు. వారి నిస్సహాయతను చూసిన గ్రామస్థులు విరాళాలు వేసుకుని ఆ మొత్తం సమకూర్చారు. ఈలోగా ఫీజు గడువు దగ్గరకు వచ్చింది. దీంతో చివరి రోజుల్లో సాంకేతిక కారణాలతో ధన్‌బాద్ ఐఐటీ ఆన్‌లైన్ పోర్టల్ పనిచేయక అతుల్ ఆ మొత్తాన్ని సకాలంలో కట్టలేకపోయాడు. సీటు వచ్చినట్టే వచ్చి చేజారింది. సాయం కోసం విద్యార్థి జాతీయ ఎస్సీ కమిషన్‌ను, జేఈఈ పరీక్ష జార్ఖండ్‌లో రాసినందున అక్కడి లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించాడు. జాతీయ ఎస్సీ కమిషన్ చేతులెత్తేయగా జార్ఖండ్ లీగల్ సర్వీస్ అథారిటీ ఈ ఏడాది ఐఐటీ మద్రాస్ ఈ పరీక్ష నిర్వహించినందువల్ల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. మద్రాస్ హైకోర్టు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కోరింది. దీంతో వారు సుప్రీంను ఆశ్రయించగా వాదనలు విన్న న్యాయస్థానం విద్యార్థికి అడ్మిషన్ కల్పించాలని ఐఐటీ ధన్‌బాద్‌ను ఆదేశించింది. ఈ మేరకు విద్యార్థికి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పింది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ గాంధీ భద్రతలో లోపం.. కాన్వాయ్ పక్కనే కర్ర పట్టుకుని బైక్‌పై వెళ్లిన వ్యక్తి
సోమవారం విచారణ సందర్భంగా.. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ‘‘అలాంటి ప్రతిభావంతుడైన యువకుడిని విడిచిపెట్టడానికి మేము అనుమతించలేము. అతుల్ కుమార్‌ను అదే బ్యాచ్‌లో చేర్చుకోవాలని, మరే ఇతర విద్యార్థి అభ్యర్థిత్వానికి భంగం కలగకుండా సూపర్‌న్యూమరీ సీటు సృష్టించాలని’’ ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
ఇది కూడా చదవండి: Virat Kohli: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ..