Site icon NTV Telugu

Varavara Rao: సుప్రీం కోర్టులో ఊరట.. భీమా కోరేగావ్ కేసులో శాశ్వత బెయిల్

Varavara Rao

Varavara Rao

Supreme Court grants bail to Varavara Rao: హక్కుల నేత వరవర రావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా సుప్రీం కోర్టులో వరవర రావుకు ఊరట లభించింది. అనారోగ్యం, వయసు, మధ్యంతర బెయిల్ దుర్వినియోగం చేయకపోవడవంతో శాశ్వత బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. జస్టిస్ ఉదయ్ లలిత్ నేత్రుత్వంలోని ధర్మాసంన అనారోగ్య కారణాల వల్ల శాశ్వత బెయిల్ మంజూరు చేసింది.

వరవర రావు బెయిల్ ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తీవ్రంగా వ్యతిరేకించింది. వరవర రావు చర్యలు దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయని.. బెయిల్ ను తీవ్రంగా వ్యతిరేకించారు అడిషనల్ సొలిసిటర్ జనరల్. అయితే వరవర రావు అనారోగ్య సమస్యలు, వయస్సు, పార్కిన్ సన్ తో బాధపడుతున్నాడని.. కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఆయన తరుపు లాయర్. వరవరరావుపై నమోదైన కేసు విచారణకు ఎంత సమయం పడుతుందని ధర్మాసనం ప్రశ్నించగా.. మరో 15 ఏళ్లు అని బదులిచ్చారు అదనపు సొలిసిటర్ జనరల్. అనారోగ్య సమస్యలతో పాటు 82 ఏళ్ల వయసు, ఇప్పటికే రెండున్నరేళ్లు జైలులో ఉండటం, ఆరు నెలల మధ్యంత బెయిల్ ను దుర్వినియోగం చేయకపోవడం వంటివి పరిగణలోకి తీసుకుని వరవర రావుకు శాశ్వత బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

Read Also: India Economy: ఆసియాలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ఎకానమీగా ఇండియా

డిసెంబర్ 31, 2017లో పూణేలోని ఎల్గార్ పరిషత్ లో వరవర రావు విద్వేష పూరిత ప్రసంగం చేశారు. దీని కారణంగా మరుసటి రోజు అంటే 2018 జనవరిలో భీమా కోరేగావ్ లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయని ఎన్ఐఏ అభియోగాలు మోపింది. మావోయిస్టులతో సంబంధం ఉన్న వారు ఈ ఎల్గార్ పరిషత్ కాంక్లేవ్ నిర్వహించరని ఎన్ఐఏ అభియోగాలు దాఖలు చేసింది. ఈ కేసులో భాగంగా 2018 ఆగస్టు 28న హైదరాబాద్ లోని వరవర రావును అదుపులోకి తీసుకుంది. చట్టవిరుద్ధ కార్యకాలపాలు( ప్రివెన్షన్) చట్టం కింద జనవరి 8, 2018లో పూణే పోలీసులు వరవర రావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Exit mobile version