Site icon NTV Telugu

బాణసంచాపై సుప్రీంకోర్ట్ నిర్ణయం.. దీపావళికి ఆ ఆదేశాలు జారీ

దీపావళి అంటే బాణాసంచా.. ఇంటిల్లిపాదీ ఉదయం లక్ష్మీ పూజ చేసి రాత్రి బాణాసంచా కాల్చకపోతే పండగ పూర్తికానట్లే.. అయితే ఈసారి దీపావళికి క్రాకర్స్ ఎక్కువగా దొరక్కపోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు దగ్గరపడుతున్న తరుణంలో బాణసంచా విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తిగా క్రాకర్స్ పై నిషేధం విధించలేదని, పర్యావరణానికి హాని కలిగించని క్రాకర్స్ మాత్రం ఉపయోగించవచ్చని తెలిపింది.

దీపావళి కాళీ పూజల సందర్భంగా నిర్దేశించిన సమయంలో గ్రీన్ ఫైర్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని, ఎట్టి పరిస్థితిలోను బేరియం సాల్ట్స్‌ ఉన్న క్రాకర్స్ వాడకూడదని, వేడుకల పేరుతో ఎదుటువారి ఆరోగ్యానికి హాని కలిగించే అధికారం ఎవరికి లేదని జస్టిస్ ఎం.ఆర్.షా, సట్సి ఎ.ఎస్.బోపన్నతో కూడిన ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. దీంతో క్రాకర్స్ కాల్చేవారికి కొంత ఉపశమనం దొరికింది. బేరియం సాల్ట్స్‌ ఉన్న క్రాకర్స్ పై పూర్తి నిషేధం విధించామని, తమ మాట తూచా తప్పకుండా పాటించాలని న్యాయస్థానం కోరింది. అంతేకాకుండా తమ ఆదేశాలను ప్రజలందరూ తెలుసుకునేలా సోషల్ మీడియా, స్థానిక కేబుల్ సర్వీసుల ద్వారా తెలియజేయాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

Exit mobile version