Site icon NTV Telugu

CJI Surya Kant: ‘‘రోహింగ్యాలను రెడ్ కార్పెట్‌తో స్వాగతించాలా..?’’ సుప్రీం ఘాటు వ్యాఖ్యలు..

Cji Surya Kant

Cji Surya Kant

CJI Surya Kant: తప్పిపోయిన ఐదుగురు రోహింగ్యాలను గుర్తించాలని కోరుతూ దాఖలపై పిటిషన్‌పై సీజేఐ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. అక్రమ వలసదారులకు దేశం రెడ్ కార్పెట్ పరిచి స్వాగతించాలా.? అని ప్రశ్నించారు. ఎవరైనా అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే వారిని దేశంలో ఉంచాల్సిన బాధ్యత ఉందా అని ప్రధాన న్యాయమూర్తి అడిగారు. రోహింగ్యాలను చట్టపరమైన ప్రక్రియ ద్వారా బహిష్కరించాలని పిటిషన్ లో కోరారు.

Read Also: Funny Incident: “ఫస్ట్ నైట్” రోజే భార్య నుంచి పారిపోయిన వ్యక్తి.. కారణం తెలిస్తే నవ్వడం ఖాయం..

దీనిని సీజేఐ మాట్లాడుతూ.. ‘‘ ముందుగా చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటుతారు. సొరంగాలు తవ్వుతారు, కంచెలు దాటుదారు. ప్రవేశించిన తర్వాత దేశ చట్టాలు తమకు వర్తిస్తాయని అంటున్నారు. ఆహారం, ఆశ్రయం, పిల్లలకు విద్య హక్కులు ఉన్నాయని చెబుతున్నారు. మనం చట్టాన్ని ఇలా అందరికి అక్రమవలసదారులకు కూడా విస్తరించాలని అనుకుంటున్నారా?’’ అని అడిగారు. మన దేశంలో కూడా పేదలు, పౌరులు ఉన్నారు, వారిపై ఎందుకు ద‌ృష్టి పెట్టడం లేదు అని ఆయన ప్రశ్నించారు.

రోహింగ్యాలను ప్రభుత్వం శరణార్థులగా ప్రకటించలేదని సీజేఐ ఎత్తి చూపారు. ‘‘ఒక శరణార్థికి చట్టపరమైన హోదా లేకపోతే, అతడు చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తే, అతడిని ఇక్కడ ఉంచాల్సిన బాధ్యత మనకు ఉందా.? ఉత్తర భారతదేశంలో మనకు చాలా సున్నితమైన సరిహద్దు ఉంది. ఒక చొరబాటుదారుడు వస్తే, వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతామా.?’’ అని సీజేఐ సూర్యకాంత్ అడిగారు. బాధిత పార్టీలు కోర్టును ఆశ్రయించకపోతే పిటిషన్ తిరస్కరించాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంను కోరారు. ఈ విషయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేశారు.

Exit mobile version