Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sugar Stock Limit: షుగర్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.. ఆ తర్వాత వాటికి కళ్లెం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడంతో.. కొంత మేర దిగివచ్చాయి.. ఇక, పండుగ సీజన్ నేపథ్యంలో చక్కెర ధరలు, సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చక్కెర నిల్వలు పేరుకుపోకుండా, హోర్డింగ్, ఊహాజనిత వ్యాపారం, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టే ఉద్దేశంతో వ్యాపారుల స్టాక్ హోల్డింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కొత్త నిబంధనలు అక్టోబర్ 15, 2026 నుంచి నవంబర్ 30, 2026 వరకు అమల్లో ఉంటాయి. కొత్త నిబంధనల ప్రకారం దేశంలోని సాధారణ ప్రాంతాల్లో చక్కెర డీలర్లు ఒకేసారి గరిష్ఠంగా 1,000 క్వింటాళ్ల వరకు మాత్రమే నిల్వ ఉంచుకోవచ్చు. అలాగే, డీలర్‌కు చక్కెర నిల్వ వచ్చిన తేదీ నుంచి 15 రోజులకు మించి ఆ స్టాక్‌ను ఉంచకూడదు. నిర్ణీత కాలంలో నిల్వను మార్కెట్లోకి విడుదల చేయాల్సి ఉంటుంది.
అయితే కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. కోల్‌కతా, దాని విస్తరించిన మెట్రోపాలిటన్ ప్రాంతాలు, అస్సాంలో డీలర్లు ఒకేసారి 2,000 క్వింటాళ్ల వరకు చక్కెర నిల్వ చేసుకోవచ్చు. ఈ ప్రాంతాల్లో మార్కెట్ అవసరాలు, రవాణా సవాళ్లు, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధిక పరిమితిని నిర్ణయించినట్లు కేంద్రం తెలిపింది. పండుగల సమయంలో చక్కెరకు డిమాండ్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సరఫరా చైన్‌లో అధికంగా నిల్వలు పేరుకుపోకుండా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. మిల్లుల నుంచి డీలర్లు, అక్కడి నుంచి వినియోగదారుల వరకు చక్కెర సజావుగా చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
Also Read
- Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. 'జై జవాన్ జై కిసాన్' రూపశిల్పి శాస్త్రి జీ..
- UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
- Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
ఇదిలా ఉండగా, ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు గరిష్ఠ స్థాయి నుంచి చక్కెర సగటు రిటైల్ ధర సుమారు 15 శాతం తగ్గింది. ఎక్స్-మిల్ ధరలు దాదాపు 28 శాతం తగ్గాయి. గత మూడు వారాలుగా ఎక్స్-మిల్ ధరలు స్థిరంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ధర తగ్గుదల ప్రయోజనం వినియోగదారులకు అందేలా టోకు, చిల్లర వ్యాపారులు చర్యలు తీసుకోవాలని కోరింది. కొత్త చక్కెర సీజన్ అక్టోబర్ 1న ప్రారంభమైన నేపథ్యంలో చెరకు లభ్యత, పంట పరిస్థితులు, వాతావరణ పరిస్థితులను బట్టి షుగర్ మిల్లులు క్రషింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, చక్కెర మిల్లులు సమన్వయంతో పనిచేసి చక్కెర ఉత్పత్తి, సరఫరా సజావుగా జరిగేలా చూడాలని కేంద్రం కోరింది.
కొన్ని చక్కెర ఉత్పత్తి ప్రాంతాల్లో తక్కువ లేదా అస్థిర వర్షపాతం ప్రభావాన్ని కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. వాతావరణ పరిస్థితులు, చెరకు దిగుబడులు భవిష్యత్ చక్కెర లభ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. వినియోగదారులు, చెరకు రైతులు, చక్కెర పరిశ్రమ ప్రయోజనాల మధ్య సమతుల్యత కొనసాగిస్తూ మార్కెట్లో తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది కేంద్రం..
తాజావార్తలు
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?