NTV Telugu Site icon

Amit Shah: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా ట్వీట్.. నక్సలిజం చివరి దశలో ఉందని వెల్లడి!

Amith Shah

Amith Shah

Amit Shah: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు ఇప్పటికీ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ ఎన్ కౌంటర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రియాక్ట్ అయ్యారు. ఇది నక్సల్స్‌ లేని భారత్ దిశగా కీలక అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందని ఆయన తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ లాంటిదన్నారు. మన భద్రతా బలగాలకు ఇదో గొప్ప విజయం అని అమిత్ షా వెల్లడించారు.

Read Also: Minister Seethakka : ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకాలు ధ్వంసం..

ఇక, నక్సల్స్‌ లేని భారత్‌ దిశగా మన ప్రయాణం కొనసాగుతుందని కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రస్తుతం దేశంలో నక్సలిజం చివరి దశలో ఉందని ఎద్దేవా చేశారు. సీఆర్‌పీఎఫ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బలగాలు ఈ జాయింట్‌ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని షా చెప్పారు. అయితే, ఛత్తీస్‌గఢ్‌- ఒడిశా సరిహద్దు జిల్లాలైన గరియాబంద్‌, నౌపాడలో జనవరి 19వ తేదీ రాత్రి నుంచి ఈ ప్రత్యేక ఆపరేషన్ కొనసాగుతుంది. పలుమార్లు జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇప్పటి వరకు 16 మంది మావోలు మరణించగా.. వారిలో కీలక నేతలు కూడా ఉన్నారని అమిత్ షా పేర్కొన్నాడు.