NTV Telugu Site icon

Subbulakshmi Jagadeesan: సీఎం స్టాలిన్‌కు షాక్.. పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత

Mk Staklin

Mk Staklin

Subbulakshmi Jagadeesan quits DMK Party: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు పెద్ద షాక్ తగిలింది. పార్టీలో కీలక నేత, మాజీ కేంద్రమంత్రి, డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ సబ్బులక్ష్మీ జదీశన్ మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో కీలక నేతగా ఉన్న సుబ్బులక్ష్మీ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. సీఎం స్టాలిన్ కు తన రాజీనామాను సమర్పించారు. క్రియాశీలక రాజకీయం నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు.

Read Also: Tiger Fear: తెలంగాణలో బాబోయ్ పులులు.. జనం బెంబేలు

14వ లోక్ సభలో సుబ్బులక్ష్మీ ఎంపీగా ఉన్నారు. తమిళనాడు తిరుచెంగోడ్ నియోజవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. సామాజిక న్యాయం, సాధికారిక మంత్రిత్వ శాఖలో కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు. జగదీశన్ 1977-1980లో తమిళనాడు ప్రభుత్వంలో జౌళి, ఖాదీ, చేనేత, చిన్న తరహా పరిశ్రమలు, ఎక్సైజ్ మంత్రిత్వ శాఖల మంత్రిగా పనిచేశారు. 1989-1991 వరకు తమిళనాడు సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖలో మంత్రిగా పనిచేశారు. 1947లో ఈరోడ్ జిల్లాలో జన్మించిన సుబ్బులక్ష్మీ ద్రవిడ మున్నేట్ర ఖజగం(డీఎంకే) పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 2004-09 మధ్య ఆమె యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.