NTV Telugu Site icon

UP: యూపీపీఎస్సీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు

Up

Up

ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPPSC) కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున నిరుద్యోగులు, ఆశావహులు ప్రయాగ్‌రాజ్‌లోని యూపీపీఎస్సీ కార్యాలయం ఎదుట మోహరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. రెండో రోజు మంగళవారం కూడా భారీగా తరలివచ్చారు. పీసీఎస్‌, ఆర్‌ఓ/ఏఆర్‌ఓ పరీక్షలను ఒకేరోజు, ఒక షిఫ్టులో నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. భారీ ఎత్తున విద్యార్థులు తరలిరావడంతో పెద్ద ఎత్తున పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మోహరించారు.

ఇది కూడా చదవండి: Speaker Ayyanna Patrudu: 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది..

విద్యార్థుల ఆందోళనపై సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ పార్టీలు స్పందించాయి. విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పరీక్షలన్నీ ఒకే విడతలో నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఎస్పీ అధినేత మాయావతి డిమాండ్ చేశారు. తక్షణమే శ్రద్ధ పెట్టాలని ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరారు. ఇక ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌.. ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. విద్యార్థుల ఆగ్రహం.. బీజేపీకి పతనానికి నాంది అవుతుందని వ్యాఖ్యానించారు.