Site icon NTV Telugu

Ladakh: రాష్ట్ర హోదా కల్పించాలని లడఖ్‌లో నిరసనలు.. బీజేపీ ఆఫీస్ దగ్ధం

Ladakh

Ladakh

రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తూ లడఖ్‌లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. దీంతో నిరసనకారులకు పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీస్ వాహనాలను ఆందోళనకారులు తగలబెట్టారు. అలాగే బీజేపీ కార్యాలయానికి కూడా నిప్పుపెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Shehbaz Sharif: భారత్-పాక్ యుద్ధాన్ని ఆపారు.. ట్రంప్ ప్రపంచ శాంతి కాముకుడు అంటూ పాక్ ప్రధాని ప్రశంసలు

బుధవారం ఉదయం లడఖ్‌లోని లేహ్ నగరంలో లడఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగ రక్షణలు కల్పించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. భారీగా నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీంతో అధికారులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాన్ని కూడా తగలబెట్టారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో జరిగిన మొదటి హింస ఇదే. జనసమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు టియర్-గ్యాస్ షెల్లింగ్ ప్రయోగించారు. లాఠీచార్జ్‌ కూడా చేశారు.

ఇది కూడా చదవండి: Maharashtra: మహా ఘోరం.. నీట్‌లో 99.99 శాతం ఉత్తీర్ణత.. అడ్మిషన్ రోజే యువకుడు ఆత్మహత్య

రెండు వారాలుగా వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ లడఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద ఆ ప్రాంతాన్ని చేర్చాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హింస చెలరేగింది. హింస చెలరేగడంతో లడఖ్ ప్రజల డిమాండ్లపై చర్చలను తిరిగి ప్రారంభించడానికి అక్టోబర్ 6న లడఖ్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రం పిలుపునిచ్చింది.

Exit mobile version