Srinagar: శ్రీనగర్-లేహ్ రహదారిపై భారీ హిమపాతం.. ఏడుగురు మృతి
- శ్రీనగర్‌పై కన్నెర్రజేసిన ప్రకృతి
- శ్రీనగర్-లేహ్ రహదారిపై భారీ హిమపాతం
- ఏడుగురు మృతి.. పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీనగర్‌పై ప్రకృతి కన్నెర్రజేసింది. ఒక్కసారిగా భారీ హిమపాతం సృష్టించింది. శ్రీనగర్-లేహ్ రహదారిపై హిమసంపాతం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా.. పలువురికి గాయాల పాలయ్యారు. ఇక పలు వాహనాలు హిమపాతంలో చిక్కుకుపోయాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
శుక్రవారం మధ్యాహ్నం శ్రీనగర్-లేహ్ హైవేపై హిమసంపాతం జరిగినట్లుగా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే. సక్సేనా ఎక్స్‌లో పేర్కొన్నారు. తాను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
Also Read
- PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
- Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
- FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
‘‘జోజి లా దగ్గర హిమసంపాతం సంభవించిన దురదృష్టకర వార్త విన్నాను. వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించి, సహాయక, రెస్క్యూ ఆపరేషన్లను ప్రారంభించాలని కార్గిల్ డీసీ, ఎస్ఎస్పీలను ఆదేశించాను. విపత్తు సహాయక దళాలు, బీఆర్ఓతో సహా అన్ని ప్రభుత్వ సంస్థలను హై అలర్ట్‌లో ఉంచాను. నేను వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాను.’’ అని ఎక్స్ పోస్ట్‌లో లెప్టినెంట్ గవర్నర్ వీకే. సక్సేనా పేర్కొన్నారు.
హిమపాతంలో దాదాపు డజను కార్లు మంచు కింద కూరుకుపోయాయని.. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ట్వీట్ చేస్తూ.. ‘‘జోజిలా కనుమ దగ్గర వాహనంపై హిమపాతం విరుచుకుపడటంతో 7 మంది విషాదకరంగా మరణించడం, మరో 5 మంది గాయపడటం గురించి తెలిసి చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాము.’’ అని తెలిపారు.

తాజావార్తలు
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?