Site icon NTV Telugu

IAS Officer: బుక్‌ వేరు. నోట్‌ బుక్‌ వేరు. కానీ వాటిని ఒక్కటి చేసిన సీనియర్‌ ఐఏఎస్‌..

Awanish Sharan

Awanish Sharan

సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ అవినాష్‌ శరణ్‌ సోషల్‌ మీడియాలో పెట్టే పోస్టులకు నెటిజన్లలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈ సందర్భంగా గతంలో ఆయన షేర్‌ చేసిన ఒక వీడియో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ తల్లి తన బిడ్డను ఒడిలో పెట్టుకొని మెట్రో రైల్లో నేల మీద కూర్చున్న వీడియో అది. ఆ వీడియో మెజారిటీ ప్రజల మెంటాలిటీకి అద్దం పట్టింది. దర్జాగా మెట్రో రైల్లో ప్రయాణిస్తున్న ఒక్కరు కూడా లేచి నిలబడి ఆ తల్లికి సీటు ఇవ్వకపోవటాన్ని ఆ వీడియో పట్టిచూపింది. ఐఏఎస్‌ ఆఫీసర్‌గా ఇదీ ఆయనలోని సూక్ష్మ సామాజిక స్పృహకి నిదర్శనం.

అవినాష్‌ శరణ్‌ ఎక్కువగా ఇలాంటి వీడియోలనే, పోస్టులనే పెడుతుంటారు. ముఖ్యంగా సొసైటీని ఆలోచింపజేసేవి. సందేశాత్మకమైనవి. ఇదే క్రమంలో మొన్న కూడా ఒక పోస్టు పెట్టారు. అయితే అది ఆయనకు సంబంధించిందే కావటం గమనార్హం. అయినప్పటికీ అది ఆసక్తికరంగా ఉంది. 2009లో యూపీఎస్సీ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్‌ అవుతున్నప్పుడు చదివిన బుక్‌ని ఆయన సోదరుడు అనూహ్యంగా ఇప్పుడు సచిత్రంగా గుర్తుచేశాడు. ఆ బుక్‌ ఇమేజ్‌లనే అవినాష్‌ శరణ్‌ తాజాగా ట్విట్టర్‌లో పెట్టారు. ‘మై ఫేవరెట్‌ బుక్‌’ అంటూ ఒక్కసారిగా ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయారు.

ఆ బుక్‌ పేరు ‘ది వండర్‌. దట్‌ వజ్‌ ఇండియా’. దాన్ని చదివేటప్పుడు అవినాష్‌ శరణ్‌ రెండు పేజీల్లో దాదాపు ప్రతి లైన్‌నీ అండర్‌లైన్‌ చేశారు. కొన్ని చోట్ల రౌండప్‌ కూడా చేశారు. పక్కన ఖాళీ ప్లేసులో రెడ్‌ ఇంక్‌తో ‘నోట్స్‌’ సైతం రాసుకున్నారు. ఇదే విషయాన్ని ఓ నెటిజన్‌ సరదాగా కామెంట్‌ రూపంలో చమత్కరించారు. ‘బుక్‌ని కాస్తా నోట్‌బుక్‌గా మార్చారు కదండీ’ అని. ఇంతకీ ఆ రెండు పేజీల్లో అంత ఇంపార్టెంట్‌ పాయింట్స్‌ ఏమున్నాయో?. అవినాష్‌ శరణ్‌ ట్విట్టర్‌ ఖాతాలోకి వెళితే ఇలాంటి ఇంట్రస్టింగ్‌ పోస్టులెన్నో చూడొచ్చు.

Exit mobile version