Site icon NTV Telugu

Jyoti Malhotra: “గూఢచారి” జ్యోతి మల్హోత్రాకి పాక్‌లో ఆరుగురు గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. వీడియో వైరల్..

Jyoti Malhotra

Jyoti Malhotra

Jyoti Malhotra: యూట్యూబర్, పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆమెకు పాకిస్తాన్ ఐఎస్ఐకి చెందిన వారితో సంబంధాలు ఉన్నట్లు తేలింది. దీంతో పాటు ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయ ఉద్యోగి డానిష్‌తో సన్నిహిత సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మూడు సార్లు పాకిస్తాన్ వెళ్లినట్లు తేలింది.

అయితే, పాకిస్తాన్ పర్యటనలో జ్యోతి మల్హోత్రాకు వీఐపీ సెక్యూరిటీ లభించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. లాహోర్ లో ఆమె పర్యటిస్తున్న సమయంలో ఆమెకు సెక్యూరిటీగా ఏకే-47 రైఫిల్స్‌లో ఆరుగురు సెక్యూరిటీ ఇచ్చారు. లాహోర్‌లోని అనార్కలి బజార్‌లో ఆమె వీడియో షూటింగ్ సమయంలో వీరంతా ఆమెతో ఉన్నారు. పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న స్కాటిష్ యూట్యూబర్ ఈ సీన్ షాక్‌కి గురిచేసింది, ఆమెకు అంత భద్రత ఎందుకు అవసరమని ఆశ్చర్యపోవడం అతని వంతైంది.

Read Also: PSL 2025 Final: పీఎస్ఎల్ ఫైనల్ కోసం 6 వేల కిమీ జర్నీ.. ఫ్లైట్ డబ్బులు వృధా కాలే!

కల్లమ్ అబ్రాడ్ అనే యూట్యూబ్ ఛానెల్ ఉన్న కల్లమ్ మిల్ మార్చిలో పాకిస్తాన్ సందర్శించారు. లాహోర్‌లోని అనార్కలీ బజార్‌లో సందర్శించిన సమయంలో, జ్యోతి మల్హోత్రాకు ఈ రేంజ్‌లో సెక్యూరిటీ ఉన్న వీడియోని అతను చిత్రీకరించారు. ఈ వీడియోలో జ్యోతి మల్హోత్రాకు సెక్యూరిటీ ఇస్తున్న వ్యక్తుల జాకెట్స్‌పై ‘‘నో ఫియర్’’ అని రాసి ఉంది. ఈ వీడియోలో కల్లమ్ తనను తాను స్కాటిష్ యూట్యూబర్‌గా పరిచయం చేసుకుంటారు. జ్యోతి అతడిని పాకిస్తాన్‌కి రావడం ఇదే మొదటిసారా..? అని అడుగుతుంది. అందుకు అతను ఐదు సార్లు వచ్చినట్లు చెబుతాడు. భారత్ వెళ్లావా..? అని అడగటం కూడా ఇందులో కనిపిస్తుంది. తాను భారత్ కి చెందిన వ్యక్తిగా జ్యోతి మల్హోత్రా పరిచయం చేసుకుంది. కల్లమ్ పాకిస్తాన్ ఆతిథ్యం గురించి అడిగినప్పుడు, చాలా బాగుంది అని జ్యోతి సమాధానం ఇస్తుంది.

జ్యోతి మల్హోత్రా గురించి మాట్లాడుతూ.. ‘‘ఆమెకు భద్రత ఉంది. ఆమెకు అన్ని గన్‌మెన్స్ అవసరం ఏంటి.?ఆమె చుట్టూ ఉన్న అని గన్స్‌ని చూడండి. ఆమె చుట్టూ ఆరుగురు గన్‌మెన్స్ ఉన్నారు.’’ అని కల్లమ్ తన వీడియో చెప్పాడు. ఈ వీడియో పలు ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. స్కాటిష్ యూట్యూబర్ ఒంటరిగా తిరుగుతుండగా, జ్యోతి చుట్టూ AK-47లతో సాయుధులైన వ్యక్తులు ఎందుకు ఉన్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

జ్యోతి మల్హోత్రా తన పాక్ పర్యటనలో పలువురిని కలిసినట్లు వెలుగులోకి వచ్చింది. భారత్ వచ్చిన తర్వాత కూడా వారితో ఆమె టచ్‌లో ఉంది. పాకిస్తాన్ వెళ్లినప్పుడు ఆమెకు పెద్ద ఎత్తున ఆతిథ్యం ఇవ్వడంతో పాటు వీఐపీ రేంజ్ సౌకర్యాలు కల్పించినట్లు తెలిసింది. ప్రస్తుతం జ్యోతి ఆర్థిక వ్యవహారాలపై నిఘా ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. ఆమె ఆదాయానికి సంబంధం లేకుండా, ఆమె లైఫ్ స్టైల్ ఉందని పోలీసులు గుర్తించారు. ఆమె విదేశీ పర్యటనలు, ఖరీదైన హోటళ్లలో స్టే వివరాలను రాబడుతున్నారు.

Exit mobile version