Site icon NTV Telugu

Jaya Kishori: వివాదంలో ఆధ్యాత్మిక బోధకురాలు జయ కిషోరి.. నెట్టింట విమర్శలు

Jayakishori

Jayakishori

ఆమె ఒక ఆధ్మాత్మిక బోధకురాలు.. ఎంతో మందిని తన ప్రసంగాలతో మోటివేషన్ చేస్తుంది. తన గానంతో.. ప్రసంగాలతో ప్రజలను ప్రేరేపిస్తోంది. జీవితానికి సంబంధించిన ఎన్నో విలువలను నేర్పిస్తుంది. విలువలు గురించి, సద్గుణాల గురించి జనాలకు పాఠాలు నేర్పిస్తుంది. ఇలాంటి ఆధ్యాత్మిక వక్త ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. ఆమెకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజలకు చెప్పేది ఒకటైతే.. ఆమె ప్రవర్తిస్తున్న జీవితం మరోలా ఉన్నాయంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు? ఏంటి? అసలేమైంది? అనుకుంటున్నారా? అయితే ఈ వార్త చదవండి.

జయా కిషోరి.. ఈమె ఆధ్యాత్మిక బోధకురాలు. శ్రీకృష్ణుని భక్తురాలిగా చెప్పుకుంటుంది. తాజాగా ఆమె ఎయిర్‌పోర్టు నుంచి వస్తున్న దృశ్యాలు చూసి అవాక్కయ్యారు. రూ.2లక్షలకు పైగా ఖరీదైన డియోర్ బ్యాగ్‌ను చూసి షాక్ అయ్యారు. జయా కిషోరి లగ్జరీ లైఫ్‌ను చూసి చర్చించుకుంటున్నారు. ప్రజలకు చెప్పేది ఒకటి.. ఆమె అనుసరిస్తున్న జీవితం మరోలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆమె హిందూ బోధకురాలై ఉండి. డియోర్ బ్యాగ్‌ను ఎలా ఉపయోగిస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ బ్యాగ్‌ విదేశాల్లో తయారైంది. పైగా ఈ బ్యాగ్ దూడ చర్మం, గొర్రె చర్మం, వివిధ రకాలైన జంతు చర్మాలతో తయారు చేస్తారు. రూ.2లక్షలకు పైగా ఖరీదైన బ్యాగ్ ఎలా ఉపయోగిస్తుందని నిలదీస్తున్నారు. మతాన్ని అడ్డంపెట్టుకుని కొందరు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తుంటారని మరొకరు కామెంట్ చేశారు. ఆమె మతపరమైన వక్త కంటే గ్లామరస్ అమ్మాయి అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు.

 

Exit mobile version