NTV Telugu Site icon

Amit Shah: “అరవింద్ కేజ్రీవాల్‌కి స్పెషల్ ట్రీట్‌మెంట్”.. సుప్రీంకోర్టు బెయిల్‌పై సంచలన వ్యాఖ్యలు…

Amit Shah. Kejriwal

Amit Shah. Kejriwal

Amit Shah: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కి ఇటీవల సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో 50 రోజుల పాటు జైలులో ఉన్నారు. అయితే, ఇటీవల ఎన్నికలక ప్రచారంలో భాగంగా అతనికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది. అయితే, ఈ బెయిల్‌పై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ బెయిల్‌ని ‘‘స్పెషల్ ట్రీట్‌మెంట్‌’’గా ఆయన అభివర్ణించారు. ‘‘ఇది సాధారణ తీర్పు కాదని నేను నమ్ముతున్నాను. దేశంలో చాలా మంది ప్రజలు కూడా ఇది స్పెషల్ ట్రీట్‌మెంట్ అని నమ్ముతున్నారు’’ అని అమిత్ షా అన్నారు.

Read Also: Sandeep Lamichhane: రేప్ కేసులో నేపాల్ క్రికెటర్కు ఊరట.. నిర్దోషిగా తేల్చిన హైకోర్టు

జైల్లో రహస్య కెమెరాలు ఉన్నాయని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల్ని అమిత్ షా కొట్టిపారేశారు. తీహార్ జైలు ఢిల్లీ ప్రభుత్వం పరిపాలనలో ఉందని, అతను అబద్ధాలు చెబుతున్నాడని అన్నారు. జూన్4న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీ సాధిస్తే తాను జైలుకు వెళ్లనని ఇటీవల కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై షా స్పందిస్తూ, ఇది సుప్రీంకోర్టును ధిక్కరించడమే అని అన్నారు. కేజ్రీవాల్ బెయిల్‌ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.

ఆప్ కేవలం 22 లోక్‌సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోందని, ఆయన దేశానికి హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. అతడిని సీరియస్‌గా తీసుకోవద్దని, దేశం మొత్తం విద్యుత్ బిల్లులు మాఫీ చేస్తానని హామీ ఇస్తున్నారని, ఆప్ కేవలం 22 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోందని, మీరు ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారుని షా ప్రశ్నించారు. అంతకుముందు కేజ్రీవాల్‌కి కేవలం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చిందని, రెగ్యులర్ బెయిల్ ఇవ్వలేదని హైలెట్ చేశారు.