NTV Telugu Site icon

Parliament: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం పిలుపు..

Parliament

Parliament

Special Session of Parliament: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్ర పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 18-22 వరకు 5 రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. గురువారం ఎక్స్(ట్విట్టర్) ద్వారా ఈ సమావేశాల గురించి వెల్లడించారు.

Read Also: chandrayaan-3: ప్రమాదాల నుంచి ప్రజ్ఞాన్ రోవర్ ఎలా తప్పించుకుంటుందో చూడండి.. ఇస్రో లేటెస్ట్ వీడియో..

‘‘పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (17వ లోకసభ 13 సెషన్, రాజ్యసభ 261వ ఎడిషన్) సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించబడుతాయి. ఈ అమృత్ కాల్ లో పార్లమెంట్ లో ఫలవంతమైన చర్చల కోసం ఎదరుచూస్తున్నాము ’’ఆయన ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. అయితే ఈ సమావేశాలకు కేంద్రం ఎందుకు పిలుపునిచ్చిందనే విషయాన్ని మంత్రి వెల్లడించలేదు.