Sonia Gandhi: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ప్రకటనలో కేంద్రంపై సోనియా తీవ్ర విమర్శలు చేశారు రాజకీయ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్రంలోని నాయకులు మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, పటేల్, ఆజాద్‌లను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో భారత బలగాలు చేసిన త్యాగాలను తక్కువ చేసి చూపేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం చారిత్రక వాస్తవాలను తప్పుగా చిత్రీకరించడాన్ని కాంగ్రెస్ అంగీరించదన్నారు. ఈ సందర్భంగానే మోడీ అనుసరిస్తున్న ఫాసిస్టు ధోరణిని తీవ్రంగా తప్పుబట్టారు.కాగా, కర్ణాటకలో బీజేపీ హర్ ఘర్ తిరంగాలో భాగంగా నెహ్రును తొలగించడంపై మండిపడ్డారు. దేశంలో గత సాధించిన విజయాలను కేంద్రం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు.
Azadi ka amrit mahotsav: భారతదేశ చరిత్రలో మరపురాని ఘట్టం.. స్వాతంత్ర్య అమృత మహోత్సవం..
గత 75 ఏళ్ల స్వాతంత్య్ర భార దేశం సైన్స్, విద్య, ఆరోగ్యం, సమాచార, సాంకేతిక రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తూ..అంతర్జాతీయ గుర్తింపును సంపాదించిందని సోనియాగాంధీ పేర్కొన్నారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఆమె తన సందేశాన్ని విడుదల చేశారు. దూరదృష్టి గల నాయకుల నాయకత్వంలో స్వేచ్ఛ, న్యాయమైన, పారదర్శక ఎన్నికల వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నామని, అదే సమయంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యంగ వ్యవస్థలను బలోపేతం చేసినట్లు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వం ద్వారా భారత్ ఎంతో గుర్తింపు పొందిందన్నారు. 75 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించామని, అయితే నేడు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను, దేశం సాధించిన విజయాలను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం చారిత్రక వాస్తవాలను తప్పుగా చూపించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. 1947లో భారతదేశ విభజనకు దారితీసిన సంఘటనలను వివరిస్తూ ఆ సమయంలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని స్పష్టంగా ఆరోపిస్తూ, జవహర్‌లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా చిత్రాలను చూపుతూ బీజేపీ తన వీడియోను విడుదల చేసిన ఒక రోజు తర్వాత సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
