కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నవ సంకల్స్ శిబిర్ పేరిట మూడు రోజుల పాటు సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సదస్సులో ముఖ్య నేతల నుంచి పలు కీలక సూచనలు, సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నేడు నవ సంకల్స్ శిబిర్ సదస్సు ముగింపు సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. ఈ ఏడాది గాంధీ జయంతి పురస్కరించుకొని అక్టోబర్ 2 రోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు “భారత్ జోడో” ( సమైఖ్య భారత్) యాత్ర ప్రారంభమౌతుందని ఆమె వెల్లడించారు. రాజ్యంగ విలువలను పరిరక్షించేందుకు, సామాజిక సౌభ్రాతృత్వాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.
రెండవ విడత జిల్లా స్థాయి జన జాగరణ్ అభియాన్ జూన్ 15 నుంచి ప్రారంభం అవుతుందని ఆమె వెల్లడించారు. రెండు, మూడు రోజులలో “టాస్క్ ఫోర్స్” నియామకం జరుగుతుందని, సంస్థాగత మార్పుల అమలు వేగవంతం చేస్తామన్నారు. అంతేకాకుండా “కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ” సభ్యుల్లోని కొంత మందితో “సలహా మండలి” ఏర్పాటు. ఆ “సలహా మండలి”
ఎప్పటికప్పుడు పార్టీ ఎదుర్కునే పలు రాజకీయ సమస్యలు, సవాళ్ల పై సలహాలు సూచనలు ఇస్తుందని ఆమె పేర్కొన్నారు.
