Site icon NTV Telugu

Sonam Raghuvanshi: భర్త వెనకాలే నడుస్తూ, వెన్నుపోటు పొడిచిన సోనమ్..

Sonam

Sonam

Sonam Raghuvanshi: దేశవ్యాప్తంగా ‘‘హనీమూన్ మర్డర్’’ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ రఘువంశీ దారుణంగా హత్య చేయించింది. హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లే కాంట్రాక్టు కిల్లర్స్ సహాయంతో హతమార్చింది. ఈ కేసు తర్వాత, పెళ్లి అంటేనే మగాళ్లు భయపడేలా చేసింది. ఈ మొత్తం ప్లాన్‌ని సోనమ్ రఘువంశీ, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా రూపొందించారు. ఆమె తన ముగ్గురు స్నేహితుల్ని కాంట్రాక్ట్ కిల్లర్స్‌గా నియమించుకుంది.

రాజా, సోనమ్ వివాహం జరిగిన 5 రోజుల తర్వాత తన చిన్ననాటి స్నేహితులైన ఆనంద్ కుమ్రి (23), ఆకాష్ రాజ్‌పుత్ (19), విశాల్ సింగ్ చౌహాన్ (22) లను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఒక కేఫ్‌కు పిలిచి రాజాను హత్య చేయడానికి ప్లాన్ చేశారు. నేరం చేసేందుకు వీరిని డబ్బుతో ప్రలోభపెట్టారు. మే 20 రాజా, సోనమ్ మేఘాలయలో తమ హనీమూన్ కోసం బయలుదేరారు. వీరిని ముగ్గురు హంతకులు వెంబడించారు. మే 20న సోనమ్ లవర్ రాజ్ తన స్నేహితుల్ని మొదట గౌహతికి పంపించి, ఆ తర్వాత ఆన్‌లైన్‌లో గొడ్డలిని ఆర్డర్ చేసినట్లు తేలింది. అక్కడ నుంచి వారు షిల్లాంగ్‌కి వెళ్లి రాజా, సోనమ్ బస చేసిన హోటల్‌కి సమీపంలో ఉన్నారు.

Read Also: Raj Kushwaha: నా కొడుకు నిర్దోషి.. ఏ పాపం తెలియదు.. సోనమ్ ప్రియుడి తల్లి ఆవేదన

ఈ జంట మొదటి మూడు రోజులు మేఘాలయ అందాలను వీక్షించారు. అయితే మే 23న ఫోటో షూట్ నెపంలో సోనమ్ కొండల్లోకి ట్రెక్కింగ్‌కి తీసుకెళ్లింది. అదే సమయంలో నిందితులు వీరిని వెంబడించారు. వీరి గురించి తెలియని రాజా వీరితో మాట్లాడుతూ వెళ్లాడు. అయితే, సోనమ్ అలసిపోయినట్లు నటిస్తూ, తన భర్త, హంతకుల వెనకాల చాలా దూరంగా నడుస్తూ వెళ్లింది. నిర్జన ప్రాంతంలోకి వెళ్లిన తర్వాత సోనమ్ అతడిని చంపండి అంటూ అరిచినట్లు తేలిసింది.

అయితే, ఈ హత్య జరుగుతున్న సమయంలో సోనమ్ ప్రియుడు రాజ్ సీన్‌లో లేడు. అతను మేఘాలయ వెళ్లలేదని పోలీస్ వర్గాలు చెప్పాయి. కానీ, ఈ మొత్తం ప్లాన్‌లో సూత్రధారిగా ఉన్నాడు. ముందుగా ఇదంతా తెలియని కుటుంబీకులు, పోలీసులు ఈ జంట తప్పిపోయిందని వెతకడం ప్రారంభించారు. జూన్ 2న రాజా మృతదేహం అక్కడి లోయలో లభించింది. ఆ తర్వాత హత్యగా తేలింది. పోస్టుమార్టం నివేదికలో అతడిపై రెండుసార్లు దాడి జరిగినట్లు తేలింది. ఒకసారి తల వెనక భాగంలో, మరోసారి ముందు నుంచి దాడి చేశారు.

ఘటన తర్వాత 24 ఏళ్ల సోనమ్ శనివారం రాత్రి ఘాజీపూర్‌లోని ఒక ధాబాలో కనిపించింది. ఆమెను చికిత్స కోసం ఘాజీపూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ ఆమె నేరాన్ని ఒప్పుకుంది. ముగ్గురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ముందుగా సోనమ తనను తాను బాధితురాలుగా చూపించే ప్రయత్నం చేసింది. చివరకు మొత్తం ప్లాన్ వెలుగులోకి వచ్చింది.

Exit mobile version