మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలైన సోనమ్ రఘువంశీ ఫ్యామిలీ.. బాధిత కుటుంబానికి మేలు చేసే నిర్ణయం తీసుకుంది. రాజా రఘువంశీ కుటుంబం పెట్టిన రూ.16 లక్షల విలువైన వివాహ ఆభరణాలను తిరిగి ఇచ్చేసింది. ఇండోర్‌లో సోనమ్ సోదరుడు గోవింద్.. రూ.16లక్షల విలువైన వివాహ ఆభరణాలను రాజా కుటుంబానికి అప్పగించాడు. బంగారు ఉంగరం, గాజులు, నెక్లెస్ సహా ఆభరణాలు తిరిగి ఇచ్చేశాడు. వివాహం సందర్భంగా రాజా కుటుంబం నుంచి వచ్చిన బహుమతులన్నీ అప్పగించేశాడు. సోనమ్ పారిపోయే ముందు.. ఆభరణాలను తన తల్లిదండ్రుల ఇంట్లో వదిలేసి వెళ్లింది. ఇక మంగళసూత్రం, వివాహ ఉంగరం మాత్రం పోలీసులు స్వాధీనంలో ఉన్నాయి. గోవింద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ద్వారా ఆభరణాలను అప్పగించారు. ఇచ్చిన వారికి తిరిగి ఇవ్వడమే న్యాయమని గోవింద్ తెలిపారు. వాటిపై తమ కుటుంబానికి ఎలాంటి హక్కు లేదని పేర్కొన్నారు. ఇక రాజా కుటుంబానికి పెట్టిన బహుమతులను తిరిగి తీసుకునేందుకు గోవింద్ కుటుంబం నిరాకరించింది. కన్యాదానం చేసిన తర్వాత తిరిగి తీసుకోవడం భావ్యం కాదని సోనమ్ తండ్రి చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: Narendra Modi: కోట శ్రీనివాసరావు గుర్తుండిపోతారు!
యూపీకి చెందిన సోనమ్.. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి మే 11న వివాహం జరిగింది. మే 20న హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లారు. అయితే భార్య సోనమ్.. హంతక ముఠాతో కలిసి భర్త రాజాను చంపేసింది. అనంతరం ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి పారిపోయింది. ఇక జూన్ 2న లోయలో రాజా మృతదేహం లభ్యమైంది. ఇక జూన్ 9న పోలీసుల ఎదుట సోనమ్ లొంగిపోయింది. హంతక ముఠాను కూడా అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Gottipati Ravi Kumar: ఏపీలో విద్యుత్తు ఛార్జీల పెంపుపై మంత్రి క్లారిటీ.. ఏమన్నారంటే..?
