Site icon NTV Telugu

త‌మిళ‌నాడులో దారుణం: డబ్బుల కోసం క‌న్న‌త‌ల్లిపై కొడుకు దాడి… అరెస్ట్‌

డ‌బ్బుల కోసం ఓ కొడుకు దారుణానికి ఒడిగ‌ట్టాడు.  క‌న్న‌తల్లి అని చూడ‌కుండా ఆమెపై దాడిచేశాడు.  తీవ్రంగా గాయ‌ప‌రిచాడు.  ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడులోని న‌మ్మ‌క్క‌ల్ జిల్లాలో చోటుచేసుకుంది.  న‌మ్మ‌క్క‌ల్ జిల్లాలోని పొన్నేరిప‌ట్టిలో నివ‌శించే ష‌ణ్ముగం అనే వ్య‌క్తి డబ్బుల కోసం తల్లిపై దాడి చేశాడు.  రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి దారుణంగా కొట్టాడు.  ఈ దాడిలో ఆమెకు తీవ్ర‌మైన గాయాల‌య్యాయి.  గ‌తంలో ఆ త‌ల్లి కుమారుడికి త‌న పొలం రాసిచ్చింది.  అయితే, ఇప్పుడు పొదుపు స్కీంలో దాచుకున్న రూ.3 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ త‌ల్లిపై దాడికి దిగాడు.  విష‌యం తెలుసుకున్న పోలీసులు ష‌ణ్ముగాన్ని అరెస్ట్ చేశారు.

Read: వ్యాపారి రాహుల్ హత్యకేసులో ప్ర‌ధాన నిందితుడు ఆరెస్ట్‌….

Exit mobile version