NTV Telugu Site icon

మందుబాబుకు షాక్: మద్యం సీసాలు పామును చూసి… 

దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే వాటిల్లో మద్యం కూడా ఒకటి. మద్యం వలన ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం వస్తుంటుంది.  కొన్ని రాష్ట్రాల్లో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది.  అలాంటి రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి.  ఇక ఇదిలా ఉంటె, తమిళనాడులోని అరియలూరుకు చెందిన సురేష్ అనే వ్యక్తి స్థానిక ప్రభుత్వ మద్యం దుకాణంలో బాటిల్ కొనుగోలు చేశాడు.  సగం తాగిన తరువాత చూస్తే అందులో పాము పిల్ల కనిపించింది.  బాటిల్ లో పాము కనిపించేసరికి మద్యం మత్తు దిగిపోయింది.  వెంటనే ఎక్కడైతే కొనుగోలు చేశాడో, అక్కడికి పరుగుపరుగున వెళ్లి మద్యం దుకాణందారులను ప్రశ్నించారు.  అయితే, వారు సరైన సమాధానం ఇవ్వలేదు.  వెంటనే ప్రాధమిక కేంద్రానికి వెళ్లి చికిత్స తీసుకొని అక్కడి నుంచి పెద్దాసుపత్రికి వెళ్ళాడు.  ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం.