Site icon NTV Telugu

Palak Muchhal: మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ గాయని.. గిన్నిస్ రికార్డులో చోటు

Palakmuchhal

Palakmuchhal

బాలీవుడ్ గాయని పాలక్ ముచ్చల్‌ను మంచి మనసు చాటుకున్నారు. దీంతో ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఇంతకీ పాలక్ ముచ్చల్ ఏం చేసింది. తెలియాలంటే ఈ వార్త చదవండి.

పేదోళ్లు కొన్ని రోగాలకు ఖర్చులు భరించలేరు. అందులో ముఖ్యంగా పేదోడికి గుండె జబ్బు లాంటి రోగం వస్తే అంతే సంగతులు. అలాంటిది నిరుపేద పిల్లల కోసం బాలీవుడ్ గాయని పాలక్ ముచ్చల్ నడుం బిగించింది. దాదాపు 3, 800 మంది నిరుపేద పిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు చేయిందేందుకు నిధులు సమకూర్చింది.

ఇది కూడా చదవండి: PM Modi: రేపు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్

పాలక్ పలాష్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా నిధులు సమకూర్చి నిరుపేద పిల్లలకు హార్ట్ సర్జరీలు చేయించింది. గతంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకోగా.. తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఓ వైపు సంగీతం.. ఇంకోవైపు సేవా కార్యక్రమాలతో ఈ అరుదైన ఘనతను సంపాదించుకుంది.

ఇది కూడా చదవండి: PM Modi: ఢిల్లీ బ్లాస్ట్‌పై తొలిసారి స్పందించిన మోడీ

పాలక్ ముచ్చల్ ఇండోర్‌లో జన్మించారు. చిన్నప్పుడు రైలు ప్రయాణంలో పేద పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి చలించిపోయింది. ఆ క్షణం ఆమె జీవితాన్ని మార్చేసింది. నిరుపేద చిన్నారుల కోసం ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో సేవా సంస్థను స్థాపించింది. ఇదిలా ఉంటే ఆమె దాతృత్వం నిరుపేద పిల్లలకే పరిమితం కాలేదు. సంవత్సరాలుగా కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు సాయపడింది. అలాగే గుజరాత్ భూకంప బాధితుల సహాయార్థం రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ సేవా కార్యక్రమంలో భర్త మిథూన్ కూడా అండగా నిలబడ్డారు. భార్య చేసే సేవా కార్యక్రమాలకు తోడుగా నిలిచారు. దీంతో విజయవంతంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Exit mobile version