భారతీయ గాయకుడు బీ ప్రాక్ అలియాస్ ప్రతీక్ బచన్‌కు లారెన్స్ గ్యాంగ్ హత్యా బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. రూ.10 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించింది. బెదిరించిన వ్యక్తి అర్జు బిష్ణోయ్‌గా పరిచయం చేసుకున్నాడు. జనవరి 6న మధ్యాహ్నం ఆడియో రికార్డింగ్ వచ్చింది. ఆ ఆడియోకు ముందు రెండు సార్లు ఫోన్ కాల్ వచ్చింది. గానీ స్పందించలేదు. జనవరి 6న మరో విదేశీ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. దీంతో మొహాలి పోలీసులకు గాయకుడు ఫిర్యాదు చేశాడు.
ఇది కూడా చదవండి: Israel: వెస్ట్ బ్యాంక్‌లో కూలిన ఇజ్రాయెల్ హెలికాప్టర్.. వీడియో వైరల్
ఆడియోలో రూ.10 కోట్లు ఇవ్వాలని.. లేకపోతే చంపేస్తామని బెదిరించారు. ఏ దేశానికైనా వెళ్లండి.. అతనితో ఎవరైనా కనిపిస్తే వారిని కూడా చంపేస్తామన వార్నింగ్ ఇచ్చారు. ఇది నకిలీ కాల్‌గా భావించొద్దని సూచించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీ ప్రాక్ అలియాస్ ప్రతీక్ బచన్.. పంజాబీ.. హిందీ సంగీత పరిశ్రమంతో సంబంధం ఉంది. సంగీత దర్శకుడిగా.. స్వరకర్తగా పరిచయం. సంగీత నిర్మాతగా కెరీర్ ప్రారంభించాడు. ‘మన్ భార్య’ పాటతో గాయకుడిగా అరంగ్రేటం చేశాడు.
ఇది కూడా చదవండి: Mauni Amavasya 2026: రేపు ఆదివారం మౌనీ అమావాస్య.. ఇవి పాటిస్తే మంచి ఫలితాలు!
