Site icon NTV Telugu

BSNL: సిమ్ హోమ్ డెలివరీ.. KYC కూడా ఇంట్లోనే..

Sam (7)

Sam (7)

బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు కొత్తగా డెలివరీ సేవను అందిస్తోంది. ఎవరైనా సిమ్ కోసం ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే.. మీరు స్టోర్ కు వెళ్లవలసిన అవసరం లేకుండానే హోమ్ డెలివరీ చేస్తోంది. KYC కూడా ఇంట్లోనే కూర్చుని చేసుకోవచ్చు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశవ్యాప్తంగా ఉన్న తన కస్టమర్ల కోసం సిమ్ కార్డ్ హోమ్ డెలివరీ సేవను అందిస్తోంది. దీని వలన ప్రజలు స్టోర్‌ను సందర్శించకుండానే BSNL సిమ్‌ను పొందవచ్చు. మీరు మీ సిమ్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి మీ ఇంటి వద్దకే డెలివరీ అవుతుంది.

సిమ్ కోసం BSNL అధికారిక పోర్టల్ కు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. Google లో “BSNL SIM హోమ్ డెలివరీ” ని సెర్చ్ చేయడం ద్వారా సిమ్ ని బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత మొబైల్ కు కన్ఫర్మేషన్ మెసేజ్ లేదా ఇమెయిల్ వస్తుంది. డోర్‌స్టెప్ వద్ద KYC.. డెలివరీ ఎగ్జిక్యూటివ్ వచ్చినప్పుడు, తక్షణ KYC ధృవీకరణ కోసం మీ ఆధార్ కార్డు లేదా ID ప్రూఫ్‌ను సిద్ధంగా ఉంచుకోండి. సిమ్‌ యాక్టివేషన్‌.. విజయవంతమైన ధృవీకరణ తర్వాత, మీ కొత్త BSNL SIM కొన్ని గంటల్లో యాక్టివేట్ అవుతుంది.

Exit mobile version