Site icon NTV Telugu

Sadhguru: “కోడి”ని మేపి “ఏనుగు”గా మార్చే సమయం వచ్చింది.. బంగ్లాదేశ్ కామెంట్స్‌పై సద్గురు..

Sadhguru

Sadhguru

Sadhguru: బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడి నాయకులు ముఖ్యంగా జమాతే ఇస్లామీ పార్టీ నేతలు, పలువురు ఇస్లామిస్ట్ విద్యార్థి నాయకులు పదే పదే భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా, తమతో పెట్టుకుంటే, భారత్‌ను ముక్కలు చేస్తామని, భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తామని, భారత్‌లోని ఇతర ప్రాంతాలను ఈశాన్య రాష్ట్రాలను కలిసే ‘‘సిలిగురి కారిడార్(చికెన్స్ నెక్)’’ను ఆక్రమించుకుంటామని ప్రగల్భాలు పలుకున్నారు.

Read Also: Mega Victory Mass song: ‘ఏందీ బాసు సంగతి.. ఇరగదీద్దాం సంక్రాంతి’.. మెగా విక్టరీ మాస్‌ సాంగ్‌ చూశారా!

అయితే, ఈ వ్యాఖ్యలపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు స్పందించారు. బంగ్లా రెచ్చగొట్టే ప్రకటనల మధ్య ఆయన మాట్లాడుతూ.. చికెన్స్ నెక్‌గా పిలువబడే ‘‘సిలిగురి కారిడార్’’ 1947 దేశ విభజన నాటి లోపమని, 1971లో బంగ్లాదేశ్ విముక్తి సమయంలోనే దీనిని సరిదిద్దాల్సిందని అన్నారు. “సిలిగురి కారిడార్ అనేది భారతదేశ విభజన వల్ల ఏర్పడిన 78 ఏళ్ల నాటి లోపం, దీనిని 1971లోనే సరిదిద్దాల్సి ఉండేది. ఇప్పుడు దేశ సార్వభౌమాధికారానికి బహిరంగ ముప్పు ఉన్నందున, ఆ కోడిని మేపి, అది ఏనుగుగా ఎదగడానికి అనుమతించాల్సిన సమయం ఆసన్నమైంది,” అని అన్నారు.

చికెన్స్ నెక్ లేదా సిలిగురి కారిడార్ అనేది ఇరుకైన సన్నని భూభాగం. ఇది భారతదేశంలోని ఇతర ప్రాంతాలను ఈశాన్య రాష్ట్రాలతో కలుపుతుంది. ఇది కేవలం 22 కి.మీ వెడల్పు, 60 కి.మీ పొడవు ఉంటుంది. దీనిని బ్లాక్ చేసి, ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తామని బంగ్లాదేశ్ రాడికల్ రాజకీయ నాయకుడు పదే పదే భారత్‌ను రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు.

Exit mobile version