Site icon NTV Telugu

మూడో డోసుపై సీరం ఇనిస్టిట్యూట్ కీల‌క వ్యాఖ్య‌లు…

ప్ర‌స్తుతం దేశంలో వేగంగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కోన‌సాగుతున్న‌ది.  ప్ర‌తిరోజూ 50 ల‌క్ష‌ల మందికి పైగా వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు.  దేశంలో కేస‌లు త‌క్కువ‌గా న‌మోద‌వ్వ‌డానికి వ్యాక్సినేష‌న్ కూడా ఒక కార‌ణం కావోచ్చు.  అయితే, దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.  రెండు డోసులు తీసుకున్నా ఆరు నెల‌ల త‌రువాత శ‌రీరంలో యాంటీబాడీల సంఖ్య త‌గ్గుతున్నాయ‌ని వైద్య‌నిపుణులు చెబుతున్నారు.  ఈ నేప‌థ్యంలో మూడో డోస్ అవ‌స‌రం ఉంద‌ని నిపుణులు అంటున్నారు.  దీనిపై కోవీషీల్డ్ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఛైర్మ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  మూడో డోసు అవ‌సరం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.  మూడో డోసు తీసుకోవ‌డం వల‌న శ‌రీరంలో యాంటీబాడీలు మ‌రింత‌గా పెరుగుతాయ‌ని ఆధ‌ర్ పూనావాలా పేర్కొన్నారు.  ఇప్ప‌టికే తాను మూడో డోసు వ్యాక్సిన్ తీసుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.  త‌మ సంస్థ‌లో ప‌నిచేస్తున్న 8 వేల మంది ఉద్యోగుల‌కు మూడో డోసు అందించిన‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.  

Read: క్షమాభిక్ష పెట్టామని అంటూనే… కాల్పులు జరుపుతున్న తాలిబ‌న్లు…

Exit mobile version