Site icon NTV Telugu

Bengaluru Stampede: బెంగళూరులో తొక్కిసలాట.. సీఎం రాజకీయ కార్యదర్శిపై వేటు, ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీ

Karnataka

Karnataka

Bengaluru Stampede: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ దుర్ఘటనకు బాధ్యులని భావిస్తున్న పలువురు కీలక అధికారులపై చర్యలు తీసుకుంటుంది. తాజాగా, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి కె. గోవింద రాజ్‌ను పదవి నుంచి తొలగించడంతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ హేమంత్ నింబాల్కర్‌ను ట్రాన్స్ ఫర్ చేసింది సిద్ధరామయ్య సర్కార్.

Read Also: Badmashulu Review: బద్మాషులు రివ్యూ

అయితే, ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కర్ణాటక సర్కార్.. గురువారం నాడు బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్‌తో పాటు మరికొందరు కీలక పోలీసు అధికారులను సస్పెండ్ చేయగా.. ఈ రోజే మరో ఇద్దరు ఉన్నతాధికారులపై వేటు వేయడం గమనార్హం. ఇందులో సీఎం సిద్ధరామయ్యు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కె. గోవింద రాజ్‌ను తక్షణమే పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. అలాగే, ఇంటెలిజెన్స్ చీఫ్ హేమంత్ నింబాల్కర్‌ను ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు బదిలీ చేసింది.

Exit mobile version